Site icon NTV Telugu

Medaram Jatara: తెలంగాణలో మేడారం జాతర సందడి.. ఈ రూట్స్‌లో స్పెషల్‌ బస్సులు

Medaram Jatara

Medaram Jatara

Medaram Jatara: తెలంగాణలో మేడారం జాతర సందడి మొదలైంది. భక్తుల ఒడిలో బంగారంలా విరాజిల్లుతున్న సమ్మక్క, సారక్కలను దర్శించుకునేందుకు భక్తులు మేడారానికి వెళ్తున్నారు. రెండేళ్లకోసారి జరిగే ఈ జాతరకు వనదేవతలను చూసేందుకు భక్తులు తండోపతండాలుగా మేడారానికి పోటెత్తారు. సమ్మక్క సారక్కలను వనదేవతలుగా భక్తులు ఆపద కాపలాగా పూజిస్తారు. మేడారం జాతరకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలోని అనేక రాష్ట్రాల నుంచి లక్షలాది మంది తరలివస్తారు. మేడారం జాతర ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర. తెలంగాణ ప్రభుత్వం ఈ జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించింది. తెలంగాణ కుంభమేళాగా పిలిచే మేడారం జాతర ఈ ఏడాది ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జరగనుంది. వనదేవతలను దర్శించుకుంటే అంతా సవ్యంగా జరుగుతుందని భక్తులకు వనదేవతలపై అపార విశ్వాసం. మేడారంలో ప్రత్యేక దేవాలయం లేదు. ఈ ఏడాది జరిగే జాతరకు ఇప్పటి నుంచే భక్తులు పోటెత్తుతున్నారు. ప్రకృతి మాతకు నివాళులు అర్పించారు. మీరు కూడా మేడారానికి వెళ్లాలనుకుంటున్నారా? అయితే ఈ రూట్లలో ప్రత్యేక బస్సులు నడుపుతామని అధికారులు చెబుతున్నారు.

Read also: Ellyse Perry: ఎల్లీస్ పెర్రీ అందం ముందు హాలీవుడ్ హీరోయిన్స్ కూడా సరిపోరు!

అదేవిధంగా తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తున్న సంగతి తెలిసిందే. మేడారం వెళ్లే మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్లు తెలుస్తోంది. మేడారం జాతరకు తరలి వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని ఈసారి 6 వేల బస్సులను నడిపేందుకు తెలంగాణ ఆర్టీసీ సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 18 నుంచి 25 వరకు బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సన్నాహాలు చేస్తోంది. కాగా ఉమ్మడి ఖమ్మం డిపోల నుంచి 400 ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సత్తుపల్లి డిపో నుంచి వెంకటాపురం, ఏటూరునాగారం, చర్ల వరకు 24 బస్సులు, మణుగూరు డిపో నుంచి మణుగూరు, మంగపేటకు 20 బస్సులు, కొత్తగూడెం డిపో నుంచి కొత్తగూడెం, టేకులపల్లికి 155 బస్సులు, మదిర డిపో నుంచి పాల్వంచ, ఖమ్మం నుంచి 35 బస్సులు, ఖమ్మం నుంచి 35 బస్సులు. భద్రాచలం నుండి 128 బస్సులు. డిపో నుంచి మేడారం వరకు 38 బస్సులు నడపనున్నారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా మేడారం జాతరకు ఎన్ని బస్సులు అందుబాటులో ఉన్నాయి, ఏయే ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నారనే వివరాలను రవాణా శాఖ మంత్రి త్వరలో వెల్లడిస్తారన్నారు.
Gyanvapi Case: వారణాసి జిల్లా కోర్టు తీర్పుపై హైకోర్టులో ముస్లిం పక్షం సవాలు

Exit mobile version