కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఏర్పాటు చేసిన రెడ్డి ఆత్మీయ సమావేశంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. అక్కడ ఆయన మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసిఆర్ రెడ్డి కమ్యూనిటీ హాల్ కు కోటి రూపాయలు కేటాయించారు. సీఎం కేసీఆర్ అన్ని సామాజీక వర్గాలకు న్యాయం చేస్తున్నారు. ఆపదలో ఉన్న పేదలను ఆదుకునే వర్గం రెడ్డి సామాజిక వర్గం. అన్ని సామాజిక వర్గాలకు ఆత్మీయతను పంచుతున్న వర్గం రెడ్డి వర్గం. రెడ్డి సామాజిక వర్గంలో పుట్టిన ప్రతి బిడ్డ వ్యవసాయం పై ఆదారపడ్డవారే . రెడ్డి సామాజీక వర్గంలో ప్రతి ఒక్కరు రైతు బిడ్డలే. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే వ్యవసాయం అభివృద్ది చెందింది. రైతులు ఆనందంగా ఉన్నారు అని తెలిపారు.
ఇక 24 గంటలకు వ్యవసాయానికి కరెంట్ అందించిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. భారత దేశంలో తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం కోటి 80 లక్షల మందికి రైతు బంధు, రైతు భీమా ఇస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. మగ్గర 5 వేల డబుల్ బెడ్ రూం ఇండ్లను కట్టించాం. రాజకీయం అనేది భగవంతుడు ఇచ్చిన వరం అన్న ఆయన పదవిలో ఉండి అడ్డదిడ్డంగా మాట్లాడకూడదు. టీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవు అని చెప్పారు. ఇక కోవిడ్ సమయంలో ప్రభుత్వం రైతాంగం కోసం 36 వేల కోట్లు అప్పు తెచ్చి మరీ ఇచ్చింది అని పేరొన్నారు.
