NTV Telugu Site icon

South central railway: సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్‌న్యూస్.. ప్రతి గురువారం స్పెషల్ వీక్లీ ట్రైన్

South Centrel Railvey

South Centrel Railvey

South central railway: హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లే వారికి దక్షిణ మధ్య రైల్వే అధికారులు శుభవార్త చెప్పింది. వేసవి రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రత్యేక రైళ్లు కాచిగూడ-తిరుపతి, కాచిగూడ-కాకినాడ పట్టణాల మధ్య నడుస్తాయి. అధికారులు వెల్లడించిన రైళ్ల షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి. నేటి నుండి ప్రతి గురువారం హైదరాబాద్‌లోని కాచిగూడ రైల్వే స్టేషన్ నుండి తిరుపతికి (రైలు నంబర్ 07061) ప్రత్యేక వీక్లీ రైలు నడుస్తుంది. ఈ ప్రత్యేక రైలు ప్రతి గురువారం రాత్రి 10.10 గంటలకు కాచిగూడ నుండి బయలుదేరుతుంది. మరుసటి రోజు అంటే శుక్రవారం ఉదయం 10.30 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరుపతి నుండి కాచిగూడకి (రైలు నెం. 07062) ప్రతి శుక్రవారం మే 26 నుండి ప్రత్యేక వీక్లీ రైలు నడుస్తుంది. ఈ రైలు తిరుపతి నుండి ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి మరుసటి రోజు అంటే శనివారం ఉదయం 4 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. ఈ రెండు మార్గాల్లోని షాద్‌నగర్, మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల్, కర్నూలు సిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, కడప, రాజంపేట, రేణిగుండ రైల్వేస్టేషన్లలో ఈ ప్రత్యేక రైళ్లు ఆగుతాయని రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు.

ఈ నెల 27 నుంచి ప్రతి శనివారం కాచిగూడ నుంచి కాకినాడ పట్టణానికి (రైలు నంబర్‌ 07417) ప్రత్యేక వీక్లీ రైలు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ ప్రత్యేక రైలు ప్రతి శనివారం కాచిగూడ నుంచి రాత్రి 8.45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.45 గంటలకు కాకినాడ పట్టణానికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 28 నుంచి ప్రతి ఆదివారం కాకినాడ పట్టణం నుంచి కాచిగూడకు (రైలు నంబర్ 07418) ప్రత్యేక రైలు నడపనున్నారు. ఈ రైలు ప్రతి ఆదివారం కాకినాడ పట్టణంలో రాత్రి 9.55 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.45 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైళ్లు కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, రాయనపాడు, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట రైల్వే స్టేషన్లలో రెండు మార్గాల్లో ఆగుతాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ ప్రత్యేక రైళ్లలో ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు.
Jogi Ramesh: నయా పెత్తందార్ల పక్షాన చంద్రబాబు ఆరాటం