MMTS: హైదరాబాద్ నగర వాసులు చాలా మంది ఎంఎంటీఎస్ ట్రైన్లలో ప్రయాణిస్తున్నారు. అయితే మెట్రో అందుబాటులోకి రావడంతో ఎంఎంటీఎస్ ట్రైన్లలో ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా కాస్త తగ్గింది. అయితే మెట్రో ట్రైన్లు మాదిరిగానే 24గంటలు ఎంఎంటీఎస్ అందుబాటులో ఉండవు.. ఎంఎంటీఎస్ చివరి సమయం అర్ధరాత్రి 10.30 వరకు మాత్రమే నడుస్తాయి. దీంతో 10.30 ఎంఎంటీఎస్ మిస్ అయితే.. ప్రయాణికులకు నిరాశే ఎదురవుతుంది. దీంతో ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని ఎంఎంటీఎస్ అధికారులు శుభవార్త చెప్పారు. మెట్రో ట్రైన్ మాదిరిగానే.. ఎంఎంటీఎస్ ట్రైన్లు కూడా అర్ధరాత్రి వరకు నడుస్తాయని ప్రకటించింది.దీంతో ఎంఎంటీఎస్ ప్రయాణికులకు ఆనందం వ్యక్తం చేశారు. ఇక నుంచి ట్రైన్లు రాత్రి 10.30 వరకే అన్న బాధలు తప్పే ఛాన్స్ ఉండనుంది. అర్ధరాత్రి వరకు ఎంఎంటీఎస్ ట్రైన్లు నడపాలని సౌత్ సెంట్రల్ రైల్వే అలోచిస్తున్నట్లు సమాచారం.
Read also: Anchor Pradeep: ప్రదీప్ ఏంటి ఇలా మారిపోయాడు..? న్యూ లుక్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..
కాగా.. హైదరాబాద్ నగరం నుంచి విశాఖపట్నం, బెంగళూరు, తిరుపతికి నడిచే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అనుగుణంగా ఎంఎంటీఎస్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తామని దక్షిణ మధ్య రైల్వే జీఎం వెల్లడించారు. విశాఖ, తిరుపతి, బెంగళూరు నుంచి నగరానికి వచ్చే వందేభారత్ రైళ్లు రాత్రి 11 గంటల తర్వాత వస్తున్నాయని జీఎం దృష్టికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. నగరంలో ప్రజా రవాణా లేక ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. విజయవాడ-లింగంపల్లి మధ్య నడిచే ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ కూడా రాత్రి 10.30 తర్వాత సికింద్రాబాద్ చేరుకుంటుందని తెలిపారు. కానీ. లింగంపల్లి వరకు వెళ్తే.. అన్ని స్టేషన్లలో ఆగదు. కాబట్టి ఈ సమయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటామని రైల్వే జీఎం వెల్లడించారు. అంతే కాకుండా ఉదయం 4 గంటల నుంచి లింగంపల్లి, ఫలక్‌నుమా, హైదరాబాద్ నుంచి ఎంఎంటీఎస్ చూడాలని ప్రయాణికులు కోరుతున్నారు. దీనిపై దక్షిణ మధ్య రైల్వే జీఎం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. మెట్రో మాదిరిగానే ఎంఎంటీఎస్ ట్రైన్లు కూడా రాత్రి వేళ్లల్లో అందుబాటులోకి వస్తే రద్దీ పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
Anchor Pradeep: ప్రదీప్ ఏంటి ఇలా మారిపోయాడు..? న్యూ లుక్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..