NTV Telugu Site icon

Secunderabad: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. శివారు స్టేషన్ల నుంచే ప్రయాణం..

Secendrabad Railway

Secendrabad Railway

Secunderabad: రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు శుభవార్త అందించారు. ఇకపై సబర్బన్ స్టేషన్ల నుంచి ప్రయాణాలు కొనసాగించవచ్చని వెల్లడించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లు రోజురోజుకు రద్దీగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో లింగంపల్లి, కాచిగూడ, హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ల నుంచి సుదూర ప్రాంతాలకు సేవలు అందించేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే లింగంపల్లి – విజయవాడ ఉద్యోగుల ప్రత్యేక ఇంటర్‌సిటీ రైలు, గౌతమి, కాకినాడ, జన్మభూమి రైళ్లు లింగంపల్లి నుంచి బయలుదేరుతున్నాయి. ఇటీవల లింగంపల్లి రైల్వే స్టేషన్‌కు విచ్చేసిన దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ ఏర్పాట్లను పరిశీలించారు. హైటెక్ సిటీ రైల్వేస్టేషన్ అభివృద్ధిపై అధికారులతో సమీక్షించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లు ఇక్కడ ఆగితే 50 శాతం మంది ప్రయాణికులు ఇక్కడి నుంచే రాకపోకలు సాగిస్తున్నట్లు గుర్తించారు. కాచిగూడ నుంచి విశాఖపట్నం, విజయవాడ, బెంగళూరులకు రైళ్లను పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నేరుగా మల్కాజిగిరి, మౌలాలి రైల్వే స్టేషన్లలో ఆగేలా చర్యలు తీసుకుంటున్నారు.

Read also: Leo: ఇంకా 50 డేస్ ఉంది కదండీ… అప్పుడే ఇలా చేస్తే ఎలా?

చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో ప్రస్తుతం 6 ప్లాట్‌ఫారమ్‌లు ఉన్నాయి. యాదాద్రి వరకు మూడో లైన్ కూడా సిద్ధం కానుంది. మౌలాలి నుంచి చర్లపల్లి నుంచి ఘట్‌కేసర్ వరకు 4 లైన్లు ఉండగా.. దూర ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లు ఇక్కడి నుంచి సులువుగా ప్రయాణించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. MMTS రెండవ దశ రైళ్లు జనవరి 2024 నాటికి ఘట్‌కేసర్ వరకు నడుస్తాయి. MMTS చర్లపల్లికి చేరుకుని అక్కడి నుండి గమ్యస్థానాలకు వెళ్లవచ్చు. లింగంపల్లి నుంచి బయలుదేరే రైలు హైటెక్ సిటీలో ఆగుతుంది. సనత్‌నగర్‌-మౌలాలి మధ్య ఎంఎంటీఎస్‌ రెండో దశలో నిర్మించిన అదనపు లైన్‌ ద్వారా చర్లపల్లికి చేరుకునేలా అధికారులు ఏర్పాట్లు చేస్తారు. కాచిగూడ నుండి రైళ్లు సీతాఫల్మండి మీదుగా మల్కాజిగిరి మరియు మౌలాలి చేరుకుంటాయి. దక్షిణ మధ్య రైల్వే అధికారుల నిర్ణయంపై రైల్వే ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నగర శివార్లలో రైళ్లలో ఎక్కి దిగడం వల్ల ప్రయాణ సమయం ఆదా అవుతుందన్నారు.
Opposition Parties: రెండ్రోజుల సమావేశం.. ‘ఇండియా’ కూటమి లోగో విడుదల