Site icon NTV Telugu

South Central Railway: దక్షిణ మధ్య రైల్వే మరో కొత్త విధానం.. డిజిటల్ పేమెంట్ ద్వారా టికెట్ కొనుగోలు..

Railway Digital Pyment

Railway Digital Pyment

South Central Railway: రైలు అనేది మధ్యతరగతి ప్రజల జీవితాలతో పెనవేసుకున్న భావోద్వేగం. సుదూర ప్రాంతాలకు వెళ్లాలనుకునే సగటు కుటుంబం మనసులో మొదటి ఎంపిక రైలు. అందుకే సినిమాలో రైలు అంటే మిడిల్ క్లాస్ గ్రౌండ్ ప్లేన్ అని సినీ రచయిత అన్నారు. పండుగలు, సెలవు రోజుల్లో రైలులో సీటు పొందాలంటే దాదాపు 20 నుంచి 30 రోజుల ముందుగానే బుక్ చేసుకోవాలి. తెలిసిన వారు ఆన్‌లైన్‌లో సీటు బుక్ చేసుకుంటే.. తెలియని వారు రిజర్వేషన్ కౌంటర్ల ద్వారా లేదా షాపుల ద్వారా టిక్కెట్‌ను రిజర్వ్ చేసుకోండి. రిజర్వేషన్ సీట్లు నిండిపోయి, వెయిటింగ్ లిస్ట్ ఎక్కువైతే కౌంటర్ వద్దకు వెళ్లి జనరల్ బోగీల్లో టికెట్ కొనుక్కోవాలి. అయితే టికెట్ కౌంటర్‌లో టిక్కెట్లు కొనుగోలు చేసేటప్పుడు ఎప్పుడైనా ఇబ్బందులు ఎదురైతే ఇకపై అలాంటి ఆందోళనలు, ఇబ్బందులు అవసరం లేదని రైల్వే శాఖ చెబుతోంది. ప్రయాణికుల సౌకర్యాలపై రాజీ పడకుండా కొత్త పాలసీలను ప్రవేశపెడుతున్న దక్షిణ మధ్య రైల్వే తాజాగా మరో కొత్త పాలసీని తీసుకొచ్చింది.

Read also: Minister Buggana Rajendranath: బడ్జెట్‌లో సంక్షేమానికే పెద్ద పీట

ప్రయాణికుల కష్టాలతో పాటు కౌంటర్ వద్ద రైల్వే సిబ్బంది పడుతున్న బాధలను అర్థం చేసుకున్న టికెట్ కౌంటర్లలో చిల్లర వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే టికెట్ కౌంటర్లలో డిజిటల్ చెల్లింపులు అందుబాటులోకి వచ్చాయి. టికెట్‌కు చిల్లర దొరకని తరుణంలో డిజిటల్‌ పేమెంట్‌ ద్వారా టికెట్‌ కొనుగోలు చేసే వెసులుబాటును తీసుకొచ్చింది. దక్షిణ మధ్య రైల్వే తాజా నిర్ణయంతో రైల్వే కౌంటర్లలో డెబిట్, క్రెడిట్ కార్డులతో చెల్లింపులు చేయవచ్చు. ఇందుకోసం తమ పరిధిలోని రైల్వే స్టేషన్లలో ఇప్పటికే 466 పీఓఎస్ మిషన్లు, యూపీఐ క్యూఆర్ కోడ్ లను అమర్చినట్లు ఎస్ సీఆర్ జీఎం అరుణ్ కుమార్ జైన్ వెల్లడించారు. దాదాపు అన్ని స్టేషన్లలో ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్, అన్ రిజర్వ్ డ్ టికెటింగ్ సిస్టమ్ కౌంటర్లలో ఇవి అందుబాటులో ఉన్నాయని తెలిపారు. దీంతో చిల్లర కష్టాలు తీరడమే కాకుండా టిక్కెట్టు తీసుకునే వారి సంఖ్య కూడా పెరుగుతుందని భావిస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వే తీసుకున్న నిర్ణయంపై రైలు ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక నుంచి కౌంటర్లలో టిక్కెట్లు కొనుగోలు చేసే సమయంలో చిల్లర కష్టాలు తొలగిపోతాయని అభిప్రాయపడ్డారు.
MS Dhoni: క్యూ లైన్‌లో నిల్చొని మరీ.. అమ్మవారిని దర్శించుకున్న ఎంఎస్ ధోనీ! వీడియో వైరల్

Exit mobile version