NTV Telugu Site icon

South Central Railway: రైల్వే ప్రయాణికులకు అలర్ట్‌.. వారం రోజులు రైళ్లు రద్దు

South Central Railway

South Central Railway

South Central Railway: దక్షిణ మధ్య రైల్వే అధికారులు రైల్వే ప్రయాణికులకు కీలక హెచ్చరిక జారీ చేశారు. వారం రోజులుగా పలు రైళ్లను రద్దు చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్లలో నిర్వహణ పనుల కారణంగా ఈ నెల 19 నుంచి 25 వరకు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. 28 రైళ్లను పూర్తిగా, మరో 6 రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఒక ప్రకటనలో ప్రకటించారు. రద్దు చేసిన వాటిలో సికింద్రాబాద్-వికారాబాద్-సికింద్రాబాద్, సికింద్రాబాద్-వరంగల్-సికింద్రాబాద్, కాచిగూడ-నడికుడి-కాచిగూడ కాజీపేట-డోర్నకల్-కాజీపేట, భద్రాచలం రోడ్-విజయవాడ-భద్రాచలం రోడ్, డోర్నకల్-విజయవాడ-డోర్నకల్, కరీంనగర్-నిజాం తదితర రైళ్లు ఉన్నాయి.

Read also: Khalistan: ఖలిస్తానీ ఉగ్రవాదుల్ని వరసగా లేపేస్తున్నారు.. యూకే, పాక్, కెనడాల్లో ఘటనలు.. వీటి వెనక “రా” ఉందా..?

ఏపీలోని విజయవాడ, గుంటూరు రైల్వే డివిజన్లలో ఈ నెల 25 వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. గుంటూరు-విశాఖపట్నం సింహాద్రి ఎక్స్‌ప్రెస్ రైలు నిర్వహణ పనుల కారణంగా ఈ నెల 19 నుంచి 25 వరకు రద్దు చేయబడింది. విశాఖపట్నం – గుంటూరు సింహాద్రి ఎక్స్ ప్రెస్ (ట్రైన్ నెం. 17240), ఈ నెల 20 – 26 వరకు, రైలు నెం. విజయవాడ – తెనాలి (07629) రైలు ఈ నెల 21న, తెనాలి – రేపల్లె (07874), రేపల్లె – తెనాలి (07875), – గుంటూరు (07282) రైళ్లను ఈ నెల 22న రద్దు చేశారు. ఈ నెల 24న విజయవాడ – గుంటూరు (07783) మధ్య నడిచే రైలును రద్దు చేశారు. ఈ విషయాన్ని తెలుగు రాష్ట్రాల్లోని ప్రయాణికులు గమనించాలని రైల్వే అధికారులు సూచించారు.

Read also: Pat Cummins Yorker: ప్యాట్‌ కమ్మిన్స్‌ సూపర్‌ యార్కర్‌.. ఇంగ్లండ్ బ్యాటర్‌ మైండ్‌ బ్లాంక్‌! వీడియో వైరల్

ఖరగ్‌పూర్‌ డివిజన్‌లో భద్రత పనులు కొనసాగుతున్న నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు వాల్తేరు రైల్వే డివిజన్ అధికారులు వెల్లడించారు. ఈ నెల 22 వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఈరోజు (జూన్ 20) (ట్రైన్ నెం. 18045) షాలిమార్-హైదరాబాద్, హైదరాబాద్- షాలిమార్ (ట్రైన్ నెం. 18046), ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్, షాలిమార్- MGR చెన్నై సెంట్రల్ (ట్రైన్ నంబర్. 22825), హౌరా- SMV బెంగళూరు (ట్రైన్ నంబర్. 22887) , సికింద్రాబాద్- షాలిమార్ (ట్రైన్ నెం. 12774), షాలిమార్-విశాఖ (ట్రైన్ నెం. 22853), సంత్రాగచ్చి-ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ (ట్రైన్ నెం. 22807), విల్లుపురం-ఖరగ్‌పూర్ (ట్రైన్ నంబర్ 22604) రైళ్లు రద్దు చేశారు.
Renault Rafale SUV: రోడ్డుపై దూసుకెళ్లనున్న రాఫెల్.. SUV నుంచి కొత్త కారు.. ఫీచర్లు చూస్తే మైండ్‌ బ్లాకే