Site icon NTV Telugu

Street food: పానీపూరీ తింటున్నారా బాబు.. తస్మాత్ జాగ్రత్త..

Sam (27)

Sam (27)

సాధారణంగా రోడ్డు మీద దొరికే పానీపూరీ చూస్తుంటే అందరికి నోరూరడం సహజమే.. అయినప్పట్టికి.. నాణ్యత, శుభ్రత లేకపోతే.. ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని సార్లు ఆరోగ్యంతో పాటు ఆదాయానికి గండి పడే అవకాశం లేకపోలేదు. ఇలాంటి ఘటనే మన నగరంలో చోటు చేసుకుంది.

పూర్త విరవరాల్లోకి వెళితే… న‌గ‌రానికి చెందిన 22 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ హెప‌టైటిస్ ఎ ఇన్ఫెక్షన్ బారిన పడ్డాడు. దీంతో ఆ యువకుడు నెల రోజుల పాటు ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వచ్చింది. దీంతో ఓ వైపు అనారోగ్యం.. మరోవైపు ఉద్యోగానికి దూరం కావ‌డ‌మే కాక‌, చికిత్స ఖ‌ర్చు భారం కూడా అత‌డి మీద ప‌డింది. న‌గ‌రంలోని ప్రధాన ఆస్పత్రుల‌లో ఒక‌టైన ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి వైద్యులు స‌కాలంలో చికిత్స చేసి అత‌డి ప్రాణాలు కాపాడారు. ఇందుకు సంబంధించిన వివ‌రాల‌ను ఆస్పత్రికి చెందిన క‌న్సల్టెంట్ గ్యాస్ట్రోఎంట‌రాల‌జిస్ట్ డాక్టర్. కలువల హర్ష తేజ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

“క‌ళ్లు, చ‌ర్మం ప‌సుపుప‌చ్చగా అయిపోవ‌డం (కామెర్లు), క‌డుపులో ఏదో ఇబ్బంది, వికారం, వాంతులు, నీర‌సం, మూత్రం బాగా ముదురు రంగులో ఉండ‌డం లాంటి స‌మ‌స్యల‌తో ఆ యువ‌కుడు ఆస్పత్రికి వెళ్లాడా యవకుడు. రెండు వారాల క్రిత రోడ్డుపై పానీపూరి తిన్నానని డాక్టర్ కు చెప్పడంతో .. ర‌క్తప‌రీక్షలు చేశారు. అనంతరం హెప‌టైటిస్ ఎ తీవ్రంగా ఉంద‌ని, దాంతోపాటే కాలేయంలోని ఎంజైమ్‌లు పెరిగాయ‌ని యాంటీ-హెచ్ఏవీ ఐజీఎం యాంటీబాడీలు పాజిటివ్ అని తేలింది..’’ అని డాక్టర్లు తెలిపారు.

‘‘ఆ యువ‌కుడికి ముందుగా హైడ్రేష‌న్ ఇచ్చి, కాలేయాన్ని కాపాడే మందులు, ఇత‌ర చికిత్సల‌తో 2-3 వారాలు పూర్తిగా విశ్రాంతి ఇచ్చామని డాక్టర్ తెలిపారు. ఎప్పటిక‌ప్పుడు ప‌రీక్షలు చేశాం. కాలేయం క్రమంగా మెరుగుప‌డింది. నాలుగు వారాల‌కు అత‌డు పూర్తిగా కోలుకున్నాడు. ఆహారం విష‌యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల‌పై కౌన్సెలింగ్ ఇచ్చి, భ‌విష్యత్తులో ర‌క్షణ కోసం హెప‌టైటిస్ ఎ టీకా తీసుకోవాల‌ని సూచించాం” అని డాక్టర్ తెలిపారు.

Exit mobile version