Site icon NTV Telugu

Telangana: తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్ బాధ్యతలు చేపట్టిన సిరిసిల్ల రాజయ్య

Rajayya

Rajayya

Telangana: తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మెన్ గా సిరిసిల్ల రాజయ్య బాధ్యతలు చేపట్టారు. ఎర్రమంజిల్ లోని కమిషన్ కార్యాలయంలో రాజయ్య బాధ్యతలు తీసుకున్నారు. సంకేపల్లి సుధీర్ రెడ్డి, రమేష్ ముదిరాజ్, నెహ్రు నాయక్ కమిషన్ మెంబర్స్ గా చార్జ్ తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి ఫైనాన్స్ కమిషన్ సెక్రటరీ స్మితా సబర్వాల్ హాజరయ్యారు. రాజయ్య మాట్లాడుతూ.. గ్రామ పంచాయితీలు ఆర్థికంగా బలోపేతం కావాలని రాజీవ్ గాంధీ ఫైనాన్స్ కమీషన్స్ ఏర్పాటు చేశారన్నారు. గత ప్రభుత్వం ఫైనాన్స్ కమిషన్ ను నిర్వీర్యం చేసిందన్నారు. నిధులు లేక గ్రామ పంచాయితీలు, మున్సిపాలిటీలు విలవిలలాడుతున్నారని అన్నారు. గ్రామ పంచాయితీలను, మున్సిపాలిటీలను బలోపేతం చేస్తామన్నారు. మూలన పడిన ఫైనాన్స్ కమిషన్ ను సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ధరించారని తెలిపారు. నాపైన ఎంతో విశ్వాసం ఉంచి నాకు బాధ్యతలు ఇచ్చిన సీఎంకు ధన్యవాదాలని తెలిపారు. రేపటి నుంచే పని ప్రారంభిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తామన్నారు.

Read also: Top Headlines@1PM: టాప్‌ న్యూస్

సిరిసిల్ల రాజయ్య 15వ లోక్‌సభకు వరంగల్లు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ప్రాతినిధ్యం వహించారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో రాజయ్య మరోసారి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఆయన బీఆర్‌ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి చేతిలో ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో కడియం… 3,92,574 ఓట్ల తేడాతో భారీ విజయం సాధించారు. మరోవైపు సిరిసిల్ల రాజయ్య కుటుంబంలో విభేదాలు తలెత్తాయి. ఆయన కోడలు ఆత్మహత్య కేసులో అరెస్టయ్యారు. ఈ ఘటన 2015లో జరిగింది.ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆయనపై దాడి చేసింది. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. కొడాలి ఆత్మహత్య కేసులో సుదీర్ఘ విచారణ తర్వాత, రాజయ్య కుటుంబం 2022 మార్చిలో నిర్దోషిగా విడుదలైంది. రాజయ్య తన ఇంటికి తిరిగి వచ్చి పార్టీలో క్రియాశీలకంగా మారారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ సీటు ఆశించారు. అయితే ఫైనాన్స్‌ కమిషన్‌ ఛైర్మన్‌గా ఆయన నియమితులైనందున ఆయనకు పోటీగా ఉండకపోవచ్చని తెలుస్తోంది.
Revanth Reddy: హైదరాబాద్ ను చంద్రబాబు, వైఎస్ ఆర్, కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేశారు..

Exit mobile version