NTV Telugu Site icon

Siricilla Police: పోలీసు అమరవీరుల త్యాగం అజరామరం

Rajanna Jilla

Rajanna Jilla

పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం మనందరి బాధ్యత అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా అడిషనల్ ఎస్పీ చంద్రయ్య. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థిని, విద్యార్థులకు సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషనులో ఓపెన్ హౌస్ నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ…. ప్రజల సేవ కోసం ప్రాణాలను అర్పించిన అమరవీరుల త్యాగాలను మరువలేమన్నారు. వారి త్యాగాలను స్మరిస్తూ ఉండాలని ఆయన అన్నారు. ఫ్లాగ్ డే లో భాగంగా నిర్వహించిన ఓపెన్ హౌస్ కార్యక్రమానికి వచ్చిన విద్యార్థిని, విద్యార్థులకు ఆయుధాల గురించి, పోలీసు చట్టాల గురించి, సీసీ కెమెరాల వల్ల కలిగే ఉపయోగాల గురించి వివరించారు.

Read Also: Mla JaggaReddy: మునుగోడులో టీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్యే పోటీ

పోలీసుల విధి నిర్వహణలో డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్ డివైస్, ట్రాఫిక్ ఎక్విప్‌ మెంట్, ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు నిబంధనల గురించి మరియు సైబర్ నేరాల గురించి వివరించారు. డయల్ 100, షీ టీమ్ గురించి, పోలీస్ విధులు, పోలీసులు ఉపయోగిస్తున్న టెక్నాలజీ పై ఆయన అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ విశ్వప్రసాద్, పట్టణ సీఐ అనిల్ కుమార్, పట్టణ ఎస్.ఐలు, ఆర్ యస్.ఐ లు పాల్గొన్నారు.

Read Also: Mastan Vali: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ఏపీకి ప్రత్యేక హోదా