NTV Telugu Site icon

Heavy Floods: మహాప్రభో మమ్మల్ని కాపాడండీ.. ఇంటెక్ వెల్ కార్మికులు

Intek Well

Intek Well

గోదావరి వరద ప్రవాహంతో ఇంటెక్‌ వెల్ లో చిక్కకున్న తమ ఆర్తనాదాలు పట్టించుకోవాలని కార్మికులు కోరుతున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం గోదావరినది ఇంటెక్‌ వెల్ల లో చిక్కకున్న ఏడుగురు తమను కాపాడాలంటూ వేడుకుంటున్నారు. సింగరేని సంస్థకు చెందిన ఐదుగురు ఉద్యోగులు బుధవారం (నిన్న) ఉదయం ఇంటెక్‌ వెల్‌ వద్ద విధులు నిర్వహించేందుకు వెళ్లిన విషయం తెలిసిందే.. అయితే ఈ క్రమమంలో గోదావరి ఉధృతి పెరగడంతో.. ఐదుగురు సింగరేణి కార్మికులు అక్కడే ఉండిపోయారు. అయితే వారిని కాపాడేందుకు వెళ్లిన ఇద్దరు సాంకేతిక లోపానికిగురై బోటు డ్రైవర్లు వరదల్లో నీటి బారినుండి తప్పించుకుని ఇంటెక్‌ వెల్‌ వద్దకు చేరుకున్నారు.

read also: TRS : టీఆర్ఎస్ లో కొందరు నాయకులు ఆ పద్ధతినే ఎంచుకున్నారా.? ఎదో అనుకుంటే ఇంకేదో అవుతుందా.?

డ్రైవర్లు కూడా అక్కడే ఇంటెక్‌ పైకి వెళ్లి తమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. 24 గంటలుగా ఇంటెక్‌ వెల్ల వద్దే ఉన్న తమను కాపాడేందుకు చొరవ తీసుకోవాలని వారు వేడుకుంటున్న ఓ వీడియో ఇప్పుడు వైరల్‌ గా మారింది. అయితే వీరిని కాపాడేందుకు వెళ్లిన ఎన్టీపీసీ పంపిన బోట్‌ సాంకేతిక లోపంతో వెను తిరగడంతో.. వారిని రక్షించేందుకు ఎన్డీఆర్‌ ఎఫ్‌ బృందాలతో పాటు గజ ఈతగాల్లు కూడా రంగంలోకి దిగారు. గోదావరినదిలో వదర ఉధృతి తీవ్రంగా వుండటంతో భయాందోళనకు గురవుతున్నారు.

YCP : ఆ ఎమ్మెల్యే సెల్ఫ్ గోల్ చేసుకున్నారా.? సీన్ లోకి ఎందుకు ఎంట్రీ అయ్యారు.?