NTV Telugu Site icon

Singareni Election Results: బీఆర్ఎస్ అనుబంధ సంఘానికి బిగ్ షాక్ ఇచ్చిన సింగరేణి

Brs Singareni Elactions

Brs Singareni Elactions

Singareni Election Results: హోరాహోరీగా సాగుతున్న సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో సీపీఐ అనుబంధ ఏఐటీయూసీ సత్తా చాటింది. మొత్తం 1436 ఓట్ల తేడాతో గుర్తింపు సంఘంగా ఎన్నికయ్యారు. మరోవైపు బీఆర్ఎస్ అనుబంధ సంఘానికి సింగరేణి ఎన్నికలు బిగ్ షాక్ ఇచ్చింది. ముందుగా పోటి చేయబోమని ప్రకటించిన టిబీజీకేఎస్.. చివరి నిమిషంలో మళ్లీ పోటికి సై అనడంతో టిబీజీకేఎస్ గెలుపుతధ్యమని భావించారు. కానీ కవిత గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘంకు ఈ ఎన్నికల్లో దారుణ ఓటమిపాలయ్యారు. మొత్తం 11 ఏరియాల్లో కనీసం పోటి సైతం ఇవ్వలేకపోయారు. గత రెండు దఫాల్లో గుర్తింపు సంఘంగా నిలిచిన బీఆర్ ఎస్ అనుబంధ టీబీజీకేఎస్ పోటీకి దూరమైంది. గనులు, శాఖల్లో మొదటి నుంచి బరిలో ఉండి పట్టు సాధిస్తామని చెబుతూనే ప్రచారాన్ని కొనసాగించిన నేతలు ఎన్నికల రోజు మాత్రం కనిపించలేదు. ఈ ఎన్నికల్లో తమ ప్రత్యర్థి ఐఎన్‌టీయూసీని గెలిపించకూడదనే ఉద్దేశంతో ఏఐటీయూసీ కార్మిక సంఘానికి అంతర్గతంగా మద్దతు పలికినట్లు సమాచారం.

Read also: PM Modi: విజయ్ కాంత్ మృతి పట్ల ప్రధాని మోడీ సంతాపం

దీంతో.. టిబీజీకేఎస్ ఓటు బ్యాంకు దారుణంగా పడిపోయింది. అయితే.. పోయిన సారిన ఎన్నికల్లో 9 డివిజన్లు గెలిచిన యూనియన్.. ఇప్పుటి ఎన్నికల్లో కేవలం 13 వందల ఓట్ల మార్కుకు చేరని పరిస్థితి నెలకొంది. సింగరేణి వ్యాప్తంగా బీఆర్ఎస్ అనుబంధం సంఘం టిబీజీకేఎస్ కు 1298 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇల్లందు లో కేవలం 1 ఓటు, బెల్లంపల్లి మూడు ఓట్లు, ఎక్కువ డివిజన్లలో డబుల్ డిజిట్ ఓట్లు వచ్చాయి. కాగా.. సింగరేణి ఎన్నికల్లో రామగుండం, బెల్లంపల్లి డివిజన్లు INTUC కొంపముంచింది. రామగుండంలో ఏఐటీయూసీ కి 646 ఓట్ల మెజార్టీ, బెల్లంపల్లి డివిజన్ లో 2757 ఓట్ల మెజార్టీ వచ్చాయి. ఏఐటీయూసీ కి వచ్చిన మొత్తం ఓవరాల్ మెజార్టీ 1999 ఓట్లు రాగా… ఈ రెండు డివిజన్లలో కలిపి 3403 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఎక్కువ డివిజన్లు గెలిచినప్పటికి ఈ రెండు డివిజన్లలో భారీ తేడాతో ఓడివడంతో గుర్తింపును INTUC దూరమైంది.

Read also: Delhi Fog: ఢిల్లీలో దట్టమైన పొగమంచు.. 22 రైళ్లు, 134 విమాన సర్వీసుల్లో జాప్యం!

ఏరియాల వారికి టిబీజీకేఎస్ కు వచ్చిన ఓట్లు ఇవే..

1. కార్పోరేట్ లో 33 ఓట్లు
2.కేజీఎంస 36
3.ఇల్లెందులో ఒక్క ఓటు..
4.మనుగూర్ 728
5.ఆర్జీ 1 ..37
6. ఆర్జీ 2.. 47
7.ఆర్జీ 3.59 ఓట్లు
8.బెల్లంపల్లి 3
9.భూపాలపల్లి 57
10.మందమర్రి 81
11.ఎస్ ఆర్ పీ216
PM Modi: విజయ్ కాంత్ మృతి పట్ల ప్రధాని మోడీ సంతాపం