Ponnam Prabhakar: రైతులు పంటలకోసం తీసుకున్న రుణాలు మాత్రమే మాఫీ అవుతాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రెండు లక్షలకు పైన రుణం తీసుకున్న రైతులు కూడా ప్రభుత్వం మాఫీ చేస్తుంది కానీ.. పైన రుణం రైతులు చెల్లించాలన్నారు. రుణమాఫీ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా రెండు బ్యాంకులలో సమస్యలు ఉన్నాయన్నారు. రుణమాఫీ విషయంలో ప్రతిపక్షాలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రైతులు పంటలకోసం తీసుకున్న రుణాలు మాత్రమే మాఫీ అవుతాయన్నారు. గ్రామాలలో ఉన్న బీఆర్ఎస్ వాళ్లకు ఎంత రుణం మాఫీ అయిందో లెక్కలు తీయాలని ఆగ్రహం వ్యక్తం చేశాఉ. వచ్చే సంవత్సరం జూన్ నెల వరకు అన్ని హంగులతో పాఠశాలను పూర్తి చేస్తామన్నారు.
Read also: Jagadish Reddy: రేవంత్ రెడ్డికి బతుకమ్మ పాట వింటే వణుకు పుడుతుంది..
రాష్ట్ర వ్యాప్తంగా 28 సమీకృత గురుకుల పాఠశాలాలకు శంకుస్థాపన చేయడం సంతోషకరంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పాఠశాలలో వాడే కరెంటు బిల్లు ప్రభుత్వమే భరిస్తుందని చెప్పామన్నారు. గత ప్రభుత్వంలో నిరుద్యోగులను పాలకులు మోసం చేశారని మండిపడ్డారు. నోటిఫికేషన్ వేసిన వెంటనే వాళ్లకు సంబంధించిన వ్యక్తులు కోర్టులలో కేసులు వేసి నిరుద్యోగులను మోసం చేశారన్నారు. కేసీఆర్ బిడ్డ కవితకు అతని బందువు వినోద్ రావుకు మాత్రం ఉద్యోగాలు పోయాక వెంటనే వారికి ఎమ్మెల్సీ ఇచ్చి ఉద్యోగాలు నియమిస్తారన్నారు. గ్రామాలలో మళ్ళీ ప్రభుత్వ పాఠశాలలపై ప్రజలకు నమ్మకం కలిగేలా చేస్తామని తెలిపారు. దేశంలో ప్రజలకు ఉపయోగపడే విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకునేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అన్నారు.
Bhatti Vikramarka: ప్రభుత్వ పాఠశాలలకు కరెంటు బిల్లు ప్రభుత్వమే కడుతుంది..