టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం విజయవంతంగా ముందుకు సాగిపోతోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటారు. తాజాగా శ్యామ్ సింగరాయ్ మూవీ యూనిట్ కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొంది. ఈ మేరకు జూబ్లీహిల్స్‌లోని ప్రశాసన్ నగర్‌లో ఉన్న జీహెచ్‌ఎంసీ పార్కులో నేచురల్ స్టార్ హీరో నాని, హీరోయిన్లు సాయి పల్లవి, కృతిశెట్టి, నిర్మాత బోయినపల్లి వెంకట్ మొక్కలు నాటారు.
Read Also:
అనంతరం నేచురల్ స్టార్ నాని మీడియాతో మాట్లాడాడు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మనందరి బాధ్యత అని పేర్కొన్నాడు. గ్లోబల్ వార్మింగ్ అరికట్టడానికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని నాని అభిప్రాయపడ్డాడు. భవిష్యత్ తరాల కోసం ప్రకృతిని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చాడు.