Nagarjuna Sagar: శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ కు స్వల్ప వదర కొనసాగుతుంది. 2 గేట్లు ఆరు అడుగుల మేర పైకి ఎత్తి 19,880 క్యూసెక్కుని నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ఇన్ ఫ్లో : 66,329 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో : 66,329 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుత నీటి మట్టం : 590.00 అడుగులు కాగా.. పూర్తి స్థాయి నీటి మట్టం : 590 అడుగులు వేశారన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు లో నీటి నిల్వ 312.0450 టీఎంసీలు… ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం : 312 .0450 టీఎంసీలుగా కొనసాగుతుంది.
Read also: 8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. జీతాల్లో భారీ పెరుగుదల.?
శ్రీశైలం జలాశయం నుంచి సాగర్ జలాశయానికి 69,884 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం 4 గేట్ల ద్వారా నీటి విడుదల తగ్గడంతో మధ్యాహ్నం రెండు గేట్లను మూసివేసి 2 గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయానికి వస్తున్న నీటిని దిగువకు వదులుతున్నారు. నాగార్జునసాగర్ డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 590 అడుగులకు చేరింది. డ్యాం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 312.0450 టీసీలుగా ఉంది. జలవిద్యకు దిగువన కేంద్రం ద్వారా 29,191 క్యూసెక్కులు, కుడి కాలువ ద్వారా 8375 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 7518 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బిసి ద్వారా 1800 క్యూసెక్కులు, లెవెల్ కెనాల్ ద్వారా 600 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
Sports University: తెలంగాణలో స్పోర్ట్స్ యూనివర్సిటీ.. ఒలింపిక్స్ స్థాయి ప్రమాణాలతో అకాడమీలు!