Site icon NTV Telugu

Akhil Pahilwan case: రాంనగర్ అఖిల్ పహిల్వాన్ కేసు.. సినీ ఇండస్ట్రీతో పరిచయాలు..!

Akhil Pahilwan

Akhil Pahilwan

Akhil Pahilwan case: హైదరాబాద్ లో రాంనగర్ అఖిల్ పహిల్వాన్ వ్యభిచారం కేసు సంచలనంగా మారింది. అయితే విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో అఖిల్ పహిల్వాన్ మొబైల్ ఫోన్ కీలకంగా మారింది. రామ్ నగర్ అఖిల్ వ్యభిచారం కేసులో దర్యాప్తు చేపడుతున్న కొద్ది విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. అఖిల్ ఫోన్ లో సగం కు పైగా వెస్ట్ బెంగాల్ అమ్మాయిలు, వ్యభిచార నిర్వాహకుల ఫోన్ నెంబర్స్ ఉండటం పోలీసులు షాక్ తిన్నారు. ఇప్పటి వరకు ఎంత మంది అమ్మాయిలను వ్యభిచారం పేరుతో హైదరాబాద్ తీసుకొచ్చాడు అనేదానిపై దృష్టి పెట్టి పోలీసులు కూపీ లాగుతున్నారు.

Read also: IPL Title Sponsor: టాటా గ్రూప్‌కే మరోసారి ఐపీఎల్ టైటిల్ హక్కులు.. టోర్నీ చరిత్రలోనే అత్యధిక మొత్తం!

రాంనగర్ అఖిల్ కు సినీ ఇండస్ట్రీతో పరిచయాలు వున్నట్లు సమాచారం. ఈవెంట్ల పేరుతో సినిమా ఇండస్ట్రీకి చెందిన కొందరితో రాంనగర్ అఖిల్ పరిచయాలు వున్నట్లు తెలుస్తోంది. జూనియర్ ఆర్టిస్టులకు సంబంధించి సెల్ ఫోన్ నెంబర్లు అఖిల్ ఫోన్ లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ లో భారీ కటౌట్స్ హంగామా తో సోషల్ మీడియాలో అడ్వటైజ్మెంట్ రామ్ నగర్ అఖిల్ చేసుకునే వాడని తెలిపారు. అఖిల్ తో పరిచయం ఉన్న వారికి అమ్మాయిలను పంపించినట్టు ఆధారాలు సేకరిస్తున్నారు. అఖిల్ అరెస్టుతో ఇతనితో సంబంధాలు ఉన్న సినీ ఆర్టిస్టుల్లో భయం మొదలైందని టాక్. తమ పేర్లు ఎక్కడ బయటకు వస్తాయో అంటూ సినిమా సెలబ్రిటీస్ వణికిపోతున్నారు. రాంనగర్ రాంనగర్ అఖిల్ కు సంబంధించి పూర్తి కాల్ డేటాను పోలీసులు బయటికి తీస్తున్నారు.
Vivo G2 Launch : అద్భుతమైన కెమెరా ఫీచర్లతో వివో G2 స్మార్ట్ ఫోన్.. ధర ఎంతంటే?

సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు నిన్న అబిట్స్ ఫార్చ్యూన్ హోటల్ పై దాడి చేశారు. ఈ దాడిలో 16 మంది యువతులు, నలుగురు యువకులు, ఇద్దరు నిర్వాహకులు, లాడ్జి యజమానిని పోలీసులు అరెస్టు చేశారు. పట్టుబడిన యువతులను కోల్‌కతా, ముంబై నుంచి తీసుకొచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఫార్చ్యూన్ హోటల్‌లో 25 గదులు ఉండగా, 16 గదులను వ్యభిచారం కోసం నిర్వహిస్తున్నట్లు సమాచారం.
Multibagger Stocks : రూ.9 షేర్ అద్భుతం చేసింది.. 292 రోజుల్లో రూ.లక్ష పెడితే రూ.15.43 లక్షలు రాబట్టింది

Exit mobile version