Site icon NTV Telugu

Ganesh Nimajjanam 2022: జై.. బోలో గణేష్ మహరాజ్‌ కీ.. భాగ్యనగరంలో ఘనంగా నిమజ్జన వేడుకలు..

Ganesh Nimajjanam

Ganesh Nimajjanam

ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా గణేష్ నిమజ్జనం సాగనుంది. ఇప్పటికే గణేష్‌ విగ్రహాలను భక్తులు నిమజ్జనం చేస్తున్నారు. హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనానికి ప్రత్యేక స్థానం ఉంది. నగరంచుట్టూ ఉన్నప్రాంతాల్లో కూడా గణపయ్యకు బైబై చెప్పే కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఖైరతాబాద్‌ లో కొలువుదీరిన శ్రీపంచముఖ మహాలక్ష్మి గణపతి నిమజ్జనానికి అన్నిఏర్పాట్లు పూర్తయ్యాయి. అరభైఏడు సంవత్సరాల ఉత్సవ కమిటీ చరిత్రలో తొలిసారి 50 అడుగుల మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. వినాయకుడు సుమారు 70 టన్నుల బరువున్న ఖైరతాబాద్‌ మహాగణపతిని తరలించేందుకు ఈ ఏడాది అత్యాధునిక ట్రాలీ వాహనాన్ని వినియోగిస్తున్నారు. ఇక దశాబ్ద కాలంగా ఎస్టీసీ ట్రాన్స్‌పోర్టు యజమానులు వెంకటరత్నం, సుధీర్‌లు మహా వినాయకుడి శోభాయాత్రకు ఉచితంగానే ట్రాలీ వాహనాన్ని సమకూరుస్తున్నారు.

బాలాపూర్‌ వినాయకుడిని ఉదయం 5 గంటలకు చివరి పూజలు నిర్వహించిన అనంతరం బాలాపూర్‌ వినాయకుడి శోభాయాత్ర ప్రారంభమైంది. మదీనా, చార్మినార్‌, అఫ్జల్‌గంజ్‌, ఎంజే మార్కెట్‌ మీదుగా శోభాయాత్ర సాగనుంది. ఉదయం 10 గంటలకు లడ్డూ వేలం ఉంటుంది. హనుమాన్‌ ఆలయంలో ప్రత్యేక పూజలు అనంతరం తర్వాత శోభాయాత్ర ప్రారంభం అవుతుంది. చాంద్రాయణగుట్ట వద్ద సిటీ కమిషనరేట్‌ లిమిట్స్‌ లో ఇది కలుస్తుంది. అక్కడ నుంచి హుస్సేన్‌ సాగర్‌ వరకు 18కిలోమీటర్లు యాత్ర సాగనుంది. హుస్సేన్‌ సాగర్‌ వైపు శోభయాత్ర మార్గాల్లో వాహనాలను అధికారులు అనుమతించండలేదు. మినీ ట్యాంక్‌ బండ్‌, సఫీల్‌ గూడ, సైబరాబాద్‌ లిమిట్స్‌ లోని కూకట్ పల్లి ఐడీఎల్ చెరువు, షేక్‌పేట్‌ మల్కం చెరువుతో పాటు 74 బేబీ పాండ్స్‌ వద్ద పటిష్ట భద్రతా చర్యలు తీసుకున్నారు. ఇక పాతబస్తీపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు పోలీసులు.

 

The liveblog has ended.
  • 10 Sep 2022 01:05 PM (IST)

    కొనసాగుతున్న గణేశ్‌ నిమజ్జనం

    హైదరాబాద్‌ హుస్సేన్‌ సాగర్‌లో గణేశ్‌ నిమజ్జనం కొనసాగుతోంది. విగ్రహాలను ఒక్కొక్కటిగా నిమజ్జనం చేస్తున్నారు. ఓ వైపు నిమజ్జనం ప్రక్రియ కొనసాగుతుండగానే, వినాయక సాగర్‌లో ఎప్పటికప్పుడు పేరుకుపోయిన వ్యర్థాలను జీహెచ్​ఎంసీ సిబ్బంది తొలగిస్తున్నారు. రహదారులపై వ్యర్థాలు, చెత్తను శుభ్రం చేస్తున్నారు. ట్యాంక్‌బండ్‌పై వాహనాలను అనుమతించకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో పంపిస్తున్నారు అధికారులు.

  • 10 Sep 2022 11:28 AM (IST)

    ఎన్టీఆర్‌ మార్గ్‌లో భారీగా నిలిచిన విగ్రహాలు

    ఎన్టీఆర్‌ మార్గ్‌లో భారీగా విగ్రహాలు నిలిచాయి. హైదరాబాద్‌ నలుమూలల నుంచి భారీగా విగ్రహాలు వస్తున్నాయి. బసీర్‌బాగ్‌, నారాయణగూడ, చిక్కడపల్లి వరకు విగ్రహాలు నిలిచిపోయాయి. గణేష్ విగ్రహాలు ఎక్కువ రావడంతో.. అధికారులు నెక్లెస్‌ రోడ్డులోకి పంపిస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం వరకు నిమర్జనం కొనసాగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

  • 10 Sep 2022 08:34 AM (IST)

    ఇవాళ మధ్యాహ్నం వరకు నిమర్జనం

    హుస్సేన్ సాగర్ లో వినయాక నిమర్జనం ఇంకా కొనసాగుతుంది. నిన్న భారీగా గణేష్ నిమర్జనం భారీగా జరిగాయి. అయితే వర్షం కారణంగా చాలా విగ్రహాలు నిమర్జనం కాలేదు. నేడు మద్యాహ్నం వరకు నిమర్జనం పూర్తి కావొచ్చని అంచనా వేస్తున్నారు అధికారులు. నిన్న అర్థరాత్రి వరకు భాగ్యనగరంలో 80 వేల చిన్నా పెద్ద విగ్రహాల నిమర్జనం జరిగాయి. ఒక్క హుస్సేన సాగర్ లోనే 40 వేల చిన్నా పెద్ద విగ్రహాల నిమర్జనం జరిగాయి. నిన్న ఆలస్యంగా ఖైరతాబాద్ గణేషుడి నిమర్జనం కావడంతో మిగతా గణేష్ నిమజ్జానాలకు ఆలస్యమైందని అధికారులు వెల్లడించారు.

  • 10 Sep 2022 08:30 AM (IST)

    హుస్సేన్ సాగర్ చుట్టూ బారులు తీరిన గణనాధులు

    నిన్న, రాత్రి వర్షం కారణంగా నిమజ్జనం కొంత ఆలస్యంగా కొనసాగుతుంది. ట్యాంక్ బండ్, ఎన్టీ ఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజాలో నిమజ్జనం సాగుతుంది. కిలోమీటర్ల మేర వినాయక విగ్రహాలు బారులు తీరాయి. ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇవాళ మధ్యాహ్నం వరకు నిమజ్జనం కొనసాగే అవకాశం వుందని అధికారులు తెలిపారు. ఇవాళ మరో 10 వేల విగ్రహాల వరకు ఒక్క హుస్సేన్ సాగర్ లోనే నిమజ్జనం జరిగే ఛాన్స్ లు కనిపిస్తున్నాయి. నిన్న దాదాపు హుస్సేన్ సాగర్ లో 40 వేల వరకు విగ్రహాల నిమజ్జనం జరిగాయి. ఇంకా భారీ సంఖ్యలో సిటీ నలుమూలల నుంచి వినాయక సాగర్ కు విగ్రహాలు తరలివస్తున్నారు. నగరమంతటా నిన్న విగ్రహాల నిమజ్జనం లక్షకుపైగా జరిగాయి.

  • 10 Sep 2022 07:05 AM (IST)

    నగరంలో రెండో రోజు కొనసాగుతున్న నిమజ్జనం

    హైదరాబాద్‌ లో గణేశ్‌ నిమజ్జనం రెండోరోజు కొనసాగుతుంది. గణేష్‌ నిమజ్జన వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతోంది. హుస్సేన్‌సాగర్‌, సరూర్‌నగర్‌ సహా పలుచోట్ల గణేశ్‌ నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా హుస్సేన్‌సాగర్‌ ప్రాంతం ప్రజలతో కిటకిటలాడుతోంది. నిమజ్జనాల కోసం రహదారులపై గణనాథులు బారులు తీరాయి. గణనాథుడికి వీడ్కోలు పలికేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.

  • 09 Sep 2022 10:10 PM (IST)

    శోభాయాత్రను పరిశీలిస్తున్న ట్రాఫిక్ అడిషనల్ సీపీ

    తెలుగు తల్లి ఫ్లై ఓవర్ వద్ద గణేష్ శోభా యాత్రను ట్రాఫిక్ ఆడిషినల్ సీపీ రంగనాథ్ పరిశీలిస్తున్నారు. కాగా గణేష్ వాహనాలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు మళ్లిస్తున్నారు.

  • 09 Sep 2022 09:35 PM (IST)

    హుస్సేన్ సాగర్ చేరుకున్న బాలాపూర్ గణేష్

    హుసేన్ సాగర్ కు చేరుకున్న బాలాపూర్ గణేశుడు.. క్రేన్ నంబర్ 9లో నిమజ్జనం.. వర్షంలోనే కొనసాగుతున్న వినాయక నిమజ్జనం

  • 09 Sep 2022 07:03 PM (IST)

    ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం పూర్తి

    హుస్సేన్ సాగర్‌లో ఖైరతాబాద్ భారీ గణేషుడి విగ్రహం నిమజ్జనం కార్యక్రమం పూర్తయ్యింది. భారీగా భక్తులు గణనాథుడికి వీడ్కోలు పలికారు.

  • 09 Sep 2022 06:02 PM (IST)

    చివరి దశకు చేరుకున్న భారీ గణనాథుడు

    ఖైరతాబాద్ గణేష్ శోభయాత్ర చివరి దశకు చేరుకుంది. నిమజ్జనం చేసేందుకు క్రేన్ నంబర్ 4 వద్దకు చేరింది. హుస్సేన్ సాగర్ వద్ద భక్తులు భారీగా గణనాథులను దర్శించుకుంటున్నారు.

  • 09 Sep 2022 05:31 PM (IST)

    క్రేన్ నంబర్ 7 వద్దకు ఖైరతాబాద్ గణపతి

    హుస్సేన్ సాగర్ వద్ద గణేష్ నిమజ్జనం అంగరంగ వైభవంగా జరుగుతోంది. క్రేన్ నంబర్ 7 వద్దకు ఖైరతాబాద్ గణపతి చేరుకున్నాడు. క్రేన్ నంబర్ 4 వద్ద ఖైరతాబాద్ గణపతిని నిమజ్జనం చేయనున్నారు.

  • 09 Sep 2022 04:30 PM (IST)

    ఎంజే మార్కెట్ వద్ద ఉద్రిక్తత

    ఎంజే మార్కెట్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ మాట్లాడుతుండగా టీఆర్ఎస్ నేత నంద కిషోర్ వ్యాస్ ఆయన్ను అడ్డుకునే ప్రయత్నం చేయగా… పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు భారీగా రంగంలోకి దిగారు.

  • 09 Sep 2022 03:56 PM (IST)

    శోభాయాత్ర తాత్కాలికంగా నిలిపివేత

    హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీవర్షం.. చార్మినార్ ప్రాంతంలో కుండపోత వర్షం.. గణేష్ నిమజ్జన శోభాయాత్రను తాత్కాలికంగా నిలిపివేసిన అధికారులు

  • 09 Sep 2022 03:25 PM (IST)

    తెలుగు తల్లి ఫ్లైఓవర్ చేరుకున్న ఖైరతాబాద్ గణపతి

    ట్యాంక్ బండ్‌పై వినాయక నిమజ్జనం కోలాహలం నెలకొంది. భారీ గణనాథులను చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. మధ్యాహ్నం 3.20 గంటల సమయానికి ఖైరతాబాద్ గణపతి తెలుగు తల్లి ఫ్లైఓవర్ చేరుకున్నాడు. నెమ్మదిగా ఖైరతాబాగ్ గణనాథుడు హుస్సేన్ సాగర్ వైపు కదులుతున్నాడు.

  • 09 Sep 2022 02:07 PM (IST)

    ఒక్కొక్కటిగా ట్యాంకుబండ్‌ బాటపడుతున్న గణనాథులు

    వినాయక విగ్రహాలు ఒక్కొక్కటిగా ట్యాంకుబండ్‌ బాటపడుతున్నాయి. ఇక పాతబస్తీ చార్మినార్‌, మోజాంజాహి మార్కెట్‌ నుంచి భారీ సంఖ్యలో గణనాథులు హుస్సేన్‌ సాగర్‌ చేరుకుంటున్నాయి. వినాయక శోభాయాత్రలో యువత, పిల్లలు డ్యాన్సులతో హోరెత్తిస్తున్నారు.. బ్యాండు, డీజీలతో హుస్సేన్‌సాగర్‌ పరిసరాలు దద్దరిల్లుతున్నాయి. గణేష్‌ నిమజ్జన శోభాయాత్రలో కోలాటం, భజనలతో మహిళలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. నగరంలో నలుమూలల నుంచి వస్తున్న గణనాథులతో ట్యాంకుబండ్‌ ఆధ్మాత్మిక పరిమళాలు వెదజల్లుతోంది.

  • 09 Sep 2022 12:03 PM (IST)

    ప్రారంభమైన ఖైరతాబాద్ బడా గణేశ్ శోభాయాత్ర

    భాగ్యనగరంలో.. ఖైరతాబాద్ బడా గణేశ్ శోభాయాత్ర ప్రారంభమైంది. అనుకున్న సమయానికి కంటే గణేశ్ శోభాయాత్ర ఆలస్యంగా ప్రారంభమయ్యింది. అయితే 50 అడుగుల ఎత్తులో కొలువుతీరిన శ్రీ పంచముఖ మహాలక్ష్మి గణపతి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన బడా గణేశుడు, 9 రోజుల పాటు విశేష పూజలందుకున్నాడు. ఇక చివరి సారిగా ఖైరతాబాద్ మహా గణనాథున్ని చూసేందుకు భక్తులు ఇతర ప్రాంతాల నుంచి తరలివస్తున్నారు. దీంతో నగరం జనసందోహంగా మారింది.

  • 09 Sep 2022 11:58 AM (IST)

    భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సహకారంతో నిమజ్జనం -మంత్రి తలసాని

    నిమజ్జనానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశామని  మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.  సిటీలో 38 వేల వినాయకులను ఏర్పాటు చేశామన్నారు. ఖైరతాబాద్ వినాయకుని శోభయాత్ర ప్రారంభమైంది, హైదరాబాద్‌లో వినాయక నిమజ్జన శోభాయాత్ర దేశంలో గ్రాండ్ గా జరుగుతుందని తెలిపారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సహకారంతో నిమజ్జనం చేస్తున్నామని మంత్రి తలసాని అన్నారు.

  • 09 Sep 2022 11:43 AM (IST)

    పకడ్బందీగా గణేష్ నిమజ్జన ఏర్పాట్లు

    భాగ్యనగరం వ్యాప్తంగా గణేష్ నిమజ్జన ఏర్పాట్లు పకడ్బందీగా సాగుతున్నాయి. పోలీసులు పహారామధ్య పాతబస్తీ వుంది. ఈనేపథ్యంలో.. గణేష్‌ ఉత్సవ సమితి జనరల్‌ సెక్రెటరీ భగవంత్‌ రావు మాట్లాడారు. గణేష్‌ నిమజ్జనంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ప్రభుత్వం స్పందించి భాగ్యనగర గణేష్‌ నిమజ్జనానికి అనుమతి ఇచ్చింది. గతంలో జరిగినట్లు గానే గణేష్‌ ఉత్సవాలు జరగాలని చిట్టచివరిలో అనుమతించడంతో.. యుద్ద ప్రాతిపదనగా ఏర్పాట్లు పూర్తీ చేశామన్నారు. గణేష్ మండపాలవారు గణేష్ నిమజ్జనానికి సాగర్‌ కు తరలి రావాలని కోరారు. ఎలాంటి ఇబ్బందులు లేవని అన్నారు. మనమందరం కూడా జాతీయ సంస్కృతిని కాపాడుకోవడానికి గణేష్ ఉత్సవాలు జరుపుకుంటున్నామన్నారు. చార్మినార్‌ ఒక కూడలి కాబట్టి పాతపట్టణంలోని గణేష్‌ విగ్రాహాలు అంతా ఇక్కడ నిమజ్జనానికి తరలి వస్తాయన్నారు. గణేష్ నిమజ్జనం ఎటువంటి అవాంతరాలు తావులేకుండా జయప్రదం కావాలని కోరారు.

  • 09 Sep 2022 10:46 AM (IST)

    బాలాపూర్ లడ్డూను సొంతం చేసుకున్న రంగారెడ్డి జిల్లా కన్వీనర్ వంగేటి లక్ష్మారెడ్డి

    బాలాపూర్‌ గణనాథుని లడ్డూ వేలంపాటలో రైతుబంధు సమితి రంగారెడ్డి జిల్లా కన్వీనర్‌ వంగేటి లక్ష్మారెడ్డి 24 లక్షల 60 వేల రూపాయలు పలికి లడ్డూను సొంతం చేసుకున్నారు. 1994 నుంచి బాలాపూర్‌లో గణేశ్ లడ్డూ వేలంపాట కొనసాగుతోంది. మొదట రూ.450తో ప్రారంభమైన బాలాపూర్ లడ్డూ వేలంపాట, 2021లో రికార్డు స్థాయికి చేరి రూ.18.90 లక్షలు పలికింది. తాజాగా దాన్ని అధిగమించింది. ఈ వేలంపాట కార్యక్రమానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి హాజరయ్యారు.

  • 09 Sep 2022 10:39 AM (IST)

    24 లక్షల 60 వేల రూపాయలు పలికిన బాలాపూర్ లడ్డూ

    బాలాపూర్‌ గణనాథుని లడ్డూ మరోసారి రికార్డు ధర పలికింది. పోటాపోటీగా సాగిన వేలంపాటలో 24 లక్షల 60 వేల రూపాయలు పలికి రైతుబంధు సమితి రంగారెడ్డి జిల్లా కన్వీనర్‌ వంగేటి లక్ష్మారెడ్డి బాలాపూర్ లడ్డూను సొంతం చేసుకున్నారు.బాలాపూర్‌ ప్రధాన కూడలిలో జరిగిన వేలంపాట కార్యక్రమానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి హాజరయ్యారు. 1994 నుంచి బాలాపూర్‌లో గణేశ్ లడ్డూ వేలంపాట కొనసాగుతోంది. మొదట రూ.450తో ప్రారంభమైన బాలాపూర్ లడ్డూ వేలంపాట.. 2021లో రికార్డు స్థాయికి చేరి రూ.18.90 లక్షలు పలికింది. తాజాగా దాన్ని అధిగమించింది.

  • 09 Sep 2022 10:28 AM (IST)

    బాలాపూర్ లడ్డూ వేలం ప్రారంభం

    బాలాపూర్ లడ్డూ వేలం ప్రారంభమైంది. లక్షా 11వేల 116 తో వేలం పాట ప్రారంభమైన బాలాపూర్ లడ్డూ వేలం 22 లక్షలు దాటి కొనసాగుతున్న లడ్డూ వేలం. గతేడాది 18లక్షల 90 వేలు పలికిన బాలాపూర్‌ లడ్డూ ధర. రికార్డు ధరలో దూసుకుపోతున్న బాలాపూర్‌ లడ్డూ వేలం.

  • 09 Sep 2022 10:13 AM (IST)

    రాష్ట్రంలోని ప్రజలందరికి గణేష్ ఆశీస్సులు వుండాలి - సబితాఇంద్రారెడ్డి

    ప్రపంచ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా బాలాపూర్‌ లడ్డూకు ఒక ప్రత్యేకత వుంది. ఖైరతాబాద్‌ గణేష్‌కు ఎంత ప్రాముఖ్యత వుంటుందో.. బాలాపూర్‌ లడ్డూకు కూడా అంతే ప్రాముఖ్యత వుంటుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఇవాళ ఉదయం బాలాపూర్ గణేషున్ని పూజించుకున్న మంత్రి సబితా మాట్లాడుతూ.. ఇది నా నియోజకవర్గం కావడం.. నేను ప్రాతినిత్యం వహించడం నాపూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని తెలిపారు. ఆగణనాథుని ఆశీస్సులు బాలాపూర్‌ లోని ప్రతి ఒక్కరిపైనా, రాష్ట్రప్రజలపైన వుండాలని కోరుకుంటున్నా అన్నారు. నిమజ్జన వేడుకలు మంచిగా జరుపుకోవాలని కోరారు. దీన్ని రాజకీయం చేయకూడదని తెలిపారు. 9రోజుల నుంచి చాలా ప్రశాంతంగా గణేష్‌ పూజలు జరుపుకున్నామన్నారు. అంతే ప్రశాంతంగా, శాంతియుతంగా గణేష్‌ వీడ్కోలు జరుపుకుందామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.

  • 09 Sep 2022 09:34 AM (IST)

    గంగమ్మ వడికి ఖైరతాబాద్‌ మహా గణనాథుడు

    ఇవాళ గంగమ్మ వడికి ఖైరతాబాద్‌ మహా గణపతి చేరునున్నాడు. అన్ని దారుణుల హుస్సేన్‌ సాగర్‌ వైపే వేచిచూస్తున్నాయి. ట్యాంక్‌ బండ్‌ పై పెద్ద ఎత్తున గణేషుణి విగ్రహాలు చేరుకుంటున్నాయి. ఇవాళ గణేష్‌ నిమజ్జనంతో భాగ్యనగరమంతా గణేష్‌ విగ్రహాలతో శోభాయమానంగా మరింది. దరహదారులపై పూలతో, వాహనాలతో గణేషుణ్ని నిమజ్జనానికి యువత డ్యాన్సులతో ముందుకు సాగతుంది. వెళ్లిరా వినాయక అంటూ గణేషుణ్ని భక్తులు సాగనంపుతున్నారు. జైబోలో గణేష్‌ మహరాజ్‌ కీ జై అంటూ మారుమ్రోగుతున్న ట్యాంక్‌ బండ్‌ పరిసర ప్రాంతాలు.

  • 09 Sep 2022 09:00 AM (IST)

    మరికొద్దిసేపట్లో ఖైరతాబాద్ బడా గణేషుడి శోభాయాత్ర ప్రారంభం

    ఖైరతాబాద్ గణేషుణ్ని దర్శించుకునేందుకు భక్తులు భారీ తీరారు. ఖైరతాబాద్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అడుగడుగున పోలీసులు మోహరించారు. మరి కాసేపట్లో ఖైరతాబాద్ మహా గణేషుణి శోభయాత్ర ప్రారంభం కానుంది.

  • 09 Sep 2022 08:26 AM (IST)

    100 టన్నుల గణేష్ బరువు మోయనున్న వాహనం

    మరికొద్దిసేపట్లో ఖైరతాబాద్ బడా గణేషుడి షోభాయాత్ర ప్రారంభం కానుంది. ఈసారి పంచముఖ మహాలక్ష్మీ గణపతిగా కొలువుదీరిన ఖైరతాబాద్ గణనాథుడు. 50 అడుగుల ఎత్తులో మట్టితో తయారైనా బడా గణేష్. మట్టితో విగ్రహ తయారు చేయడంతో విగ్రహ బరువు 60 నుండి 70 టన్నులకు చేరింది. విగ్రహ నిమర్జన తరలింపుకు 70 అడుగుల పొడువు, 11 అడుగుల వెడల్పు ఉన్న 26 టైర్ల టస్కర్ వాహనం ఏర్పాటు చేశారు అధికారులు. 100 టన్నుల గణేష్‌ బరువును వాహనం మోసేందుకు సిద్దమైంది. ఎన్టీఆర్ మార్గ్ క్రేన్ నం 4 వద్ద ఖైరతాబాద్ గణనాథుడి నిమర్జనం జరగనుంది. మద్యాహ్నం 2 గంటల లోపు నిమర్జనం పూర్తయ్యేలా అవకాశాలు వుంది.

  • 09 Sep 2022 07:50 AM (IST)

    కాసేపట్లో బాలాపూర్‌ లడ్డూ వేలం

    మరికాసేపట్లో బాలాపూర్‌ లడ్డూవేలం ప్రారంభం కానుంది. లడ్డూవేలంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. శోభయాత్ర ప్రారంభైంది. వెళ్లిరా వినాయక అంటూ భక్తులు సాగనంపుతున్నారు. జైబోలో గణేష్‌ మహరాజ్‌కీ జై అంటూ మర్మోగుతున్న మాఢ వీధులు. నిమజ్జనానికి గణనాథులు తరలి వెళ్తున్నారు.

Exit mobile version