ఫ్లై ఓవర్లు, కేబుల్ బ్రిడ్జిలతో హైదరాబాద్ నగరం కొత్త రూపం సంతరించుకుంటోంది. తాజాగా మరో ఫ్లై ఓవర్ హైదరాబాద్ కీర్తికిరీటంలోకి వచ్చి చేరింది. గచ్చిబౌలి ప్రాంతంలో శిల్ప లేఅవుట్ ఫ్లైఓవర్ ప్రారంభం అయింది. ఫ్లైఓవర్ ను ప్రారంభించారు మంత్రి కేటీఆర్ . ఈ ఫ్లైఓవర్ తో ఓఆర్ఆర్ వెళ్లేందుకు తగ్గనుంది సమయం. జూబ్లీహిల్స్, పంజాగుట్ట నుండి గచ్చిబౌలి మీదుగా పఠాన్ చెరు, కోకాపేట్, నార్సింగి, విమానాశ్రయం వెళ్లేందుకు సులభతరం కానుంది. 956 మీటర్ల పొడవు 16.60 మీటర్ల వెడల్పు తో నిర్మించారు ఫ్లైఓవర్. దీంతో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హై టెక్ సిటీ మధ్య మరింత పెరగనుంది రోడ్ కనెక్టివిటీ.
ShilpaLayout Flyover Inauguration Live: గచ్చిబౌలిలో కొత్త ఫ్లై ఓవర్.. ట్రాఫిక్ కష్టాలకు చెక్

Maxresdefault (1)
