Site icon NTV Telugu

సమ్మక్క-సారక్క జాతరలో షిఫ్ట్‌వైజ్‌గా దర్శనం..

తెలంగాణకే తలమానికమైన సమ్మక్క-సారక్క జాతర ఏర్పాట్లను మంత్రి సత్యవతి రాథోడ్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సమ్మక్క-సారక్క జాతరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనా నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు. రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలను నుంచి రోజుకు సుమారు 3 లక్షల మంది అమ్మవార్ల దర్శనం కోసం విచ్చేస్తారని అంచనా వేసినట్లు ఆమె పేర్కొన్నారు.

భక్తుల ఆరోగ్య దృష్ట్యా జాతరలో మెడికల్‌ క్యాంప్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కరోనా కారణంగా షిఫ్ట్‌వైజ్‌గా భక్తులు దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేశామని, వీఐపీ పాస్‌లపై టైమింగ్‌ స్లాట్‌ ఇవ్వబోతున్నామని ఆయన తెలిపారు. జాతర దగ్గరలో భూమి కోనేందుకు ప్రయత్నిస్తున్నామని, జాతరకు కేంద్ర నుంచి ఎలాంటి నిధులు రాలేదని ఆమె స్పష్టం చేశారు. ఈ సారి సమ్మక్క-సారక్క జాతరకు 18వ తేదీన సీఎం కేసీఆర్‌ వస్తున్నట్లు ఆమె వెల్లడించారు.

Exit mobile version