NTV Telugu Site icon

Fake Kidnap: ఫిల్మ్ నగర్ పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించిన యువకుడు

Ganjaye

Ganjaye

Fake Kidnap: ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు రావాల్సిన విద్యార్థులు గంజాయికి అలవాటుపడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. కుటుంబానికి, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని తల్లిదండ్రులు కలలు కంటుండగా అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. మద్యం, గంజాయికి బానిసైన ఓ యువకుడి తెలివితేటలు చూసి పోలీసులు షాక్ అయ్యారు. గంజాయి, మద్యం సేవించేందుకు పోలీసులను, కన్న తండ్రిని సుపుత్ర బరిడీ కొట్టించాడు. జల్సాచేస్తూ.. పోలీసులకు చిక్కాడు. అతితెలివితో ఫిల్మ్ నగర్ పోలీసులను ఉలిక్కిపడేలా చేశాడు. నాలుగు రోజుల క్రితం షేక్ పేట్ కు చెందిన షోయబ్.. స్నేహితుడితో గొడవ పడ్డాడని తండ్రికి ఫోన్ చేశాడు. చాలా బాధగా ఉందని, ఇంటికి రాలేకపోతున్నానని చెప్పాడు. తండ్రి కొడుకుని ఇంటికి రమ్మని అడిగాడు. అయితే చాలా సేపటి వరకు షోయబ్ ఇంటికి రాకపోవడంతో షోయబ్ తండ్రి ఫోన్ చేశాడు. షోయబ్ ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో ఆందోళన చెందిన తండ్రి 100కు డయల్ చేయగా.. తన కొడుకు కిడ్నాప్ అయ్యాడని చెప్పాడు. షోయబ్ తండ్రికి తన స్నేహితుడు హమీద్‌పై అనుమానం ఉందని చెప్పడంతో.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగి సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా రెండు గంటలపాటు శ్రమించి షోయబ్ నగర శివారులో ఉన్నట్లు గుర్తించారు.

అక్కడికి వెళ్లగానే పోలీసులు ఆశ్చర్యపోయారు. షోయబ్, హమీద్‌ తో కలిసి మద్యం సేవించి జల్సా చేస్తున్నాడు. పోలీసులను చూసిన షోయబ్ పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే షోయబ్‌ను పట్టుకున్న పోలీసులు అతడిని ప్రశ్నించారు. ఇలా ఎందుకు చేశావని ప్రశ్నించగా.. మద్యం మత్తులో ఏం చేశాడో తెలియదని సమాధానమిచ్చాడు. షోయబ్‌ను తీసుకెళ్లి తండ్రికి అప్పగించారు. మరోసారి ఇలా జరిగితే శిక్ష తప్పదని హెచ్చరించారు. షోయబ్ ఎవరి దగ్గర నుంచి గంజాయి కొన్నాడు? షోయబ్, హమీద్‌లు తమ తండ్రిపై గొడవ పడ్డాడని ఎందుకు చెప్పాడు? అలా చెప్పమని షోయబ్‌కి హమీద్ చెప్పాడా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తండ్రికి ఫోన్ చేసి షోయబ్‌ని అప్పగించారు.

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పాతబస్తీలో కలకలం రేగింది. పాతబస్తీలో గంజాయి ముఠా మధ్య జరిగిన యుద్ధం ఒకరి ప్రాణాలను బలిగొంది. శ్మశాన వాటికలో గంజాయి బ్యాచ్‌పై దాడి చేశారు. ఈ దాడుల్లో పర్వేజ్ అనే యువకుడు గాయపడ్డాడు. వెంటనే అతడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పర్వేజ్ మృతి చెందాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
CM YS Jagan: ఆర్టీసీ బస్సు ప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం