Site icon NTV Telugu

Breaking : హైదరాబాద్‌లో పలువురు ఐపీఎస్‌లకు పోస్టింగ్‌లు

హైదరాబాద్‌లో పలువురు ఐపీఎస్‌లకు ప్రభుత్వం పోస్టింగ్‌లు ఇచ్చింది. సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్‌ను ఆకస్మికంగా ప్రభుత్వం బదిలీ చేసింది. డీసీపీ విజయ్ కుమార్‌ను డీజీపీ ఆఫీసుకు అటాచ్ చేస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. అంతేకాకుండా సెంట్రల్ జోన్ డీసీపీగా రాజేశ్ చంద్రకు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. సౌత్ జోన్ డీసీపీగా సాయి చైతన్యను నియమించింది. ఈస్ట్ జోన్ డీసీపీగా సతీష్‌కు ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. అయితే సైబరాబాద్‌ డీసీపీ విజయ్‌ కుమార్‌ను ఆకస్మికంగా బదిలీ చేయడంపై క్లారిటీ రాలేదు. అయితే గత నెలలో కూడా తెలంగాణ ప్రభుత్వం 30 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్ కు పోస్టింగ్ ఇచ్చింది. అంజనీకుమార్ కు ఏసీబీ డీజీగా బదిలీ చేసింది. పలు జిల్లాల ఎస్పీలు కూడా బదిలీ అయ్యారు.

Exit mobile version