NTV Telugu Site icon

కారు నడుపుతూ బైక్‌ను ఢీకొట్టిన సీరియల్‌ నటి లహరి కారు !

శంషాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో బైక్‌ మీద వెళ్తున్న ఓ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. టీవీ సీరియల్స్‌ నటి లహరి కారు నడుపుతూ బైక్‌ మీద వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టింది. బాధితుడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం తర్వాత కారు చుట్టూ గుమిగూడిన జనాల్ని చూసి భయపడిన లహరి, కిందికి దిగలేదు. దాంతో పోలీసులు, ఆమెను కారులోనే పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. లహరి మద్యం సేవించిందేమోనన్న అనుమానంతో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ పరీక్షలు చేశారు. అయితే ఆమె మద్యం సేవించలేదని తేలింది. మరోవైపు గాయపడ్డ వ్యక్తి తరఫున ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో… లహరిని ఇంటికి పంపించేశారు.