NTV Telugu Site icon

TSRTC: పురుషులకు ప్రత్యేక బస్సులు?.. ప్రత్యామ్నాయ ఆలోచనల్లో ఆర్టీసీ

Tsrtc

Tsrtc

TSRTC: మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ఆర్టీసీ బస్సుల్లో రద్దీ నెలకొంది. ఆక్యుపెన్సీ రేషియో గణనీయంగా పెరిగింది. ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉంది. మహిళలు ముందు వరుస నుంచి చివరి వరకు ఉంటున్నారు. ఈ పరిణామం పురుషులకు కాస్త ఇబ్బందిగా మారింది. స్కూలు పిల్లలు కూడా ఒక సవాలుగా ఎదుర్కొన్నారు. చాలా చోట్ల బస్సు రద్దీగా ఉండడంతో పాఠశాల విద్యార్థులు బస్సు ఎక్కేందుకు వేచి ఉన్నారు. పురుషుల పరిస్థితి కూడా అలాగే ఉంది. ఏ బస్సులు చూసిన మహిళలతోనే నిండుగా ఉండటమే కాకుండా.. ఒకవేళ పురుషులు వున్నా వారు నిలబడటానికి చోటుకూడా లేకుండా పోతుంది. దీంతో గత్యంతరం లేక చాలా మంది ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఈ పరిణామాలను ఆ సంస్థ ఎండీ ఎదుట ఆర్టీసీ సిబ్బంది ప్రస్తావించినట్లు సమాచారం. అవసరమైన రూట్లు, సమయాల్లో పురుషుల కోసం ప్రత్యేక బస్సులను నడపడం ఎలా? ఆర్టీసీ ఆలోచన చేస్తుంది.

Read also: Pallavi Prasanth : హీరోగా పల్లవి ప్రశాంత్ ఎంట్రీ..డిటైల్స్ లీక్ చేసిన పాటబిడ్డ..

ముఖ్యంగా వృద్ధులకు సీట్ల కేటాయింపుపై చర్చలు జరుగుతున్నాయి. అలాగే.. విద్యార్థుల సమస్యకు పరిష్కారం చూపేందుకు కృషి చేస్తోంది. వారు తమ మార్గంలో కొన్ని ప్రత్యేక సేవలను నడుపుతున్నారా? ఆలోచిస్తున్నాను. దీనిపై ఉన్నతాధికారులు చర్చిస్తున్నారు. ఉచిత పథకంతో ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ విపరీతంగా పెరుగుతోంది. ఈ నిష్పత్తి గతంలో 69 శాతం నుంచి 89 శాతానికి పెరిగింది. గతంలో 12 నుంచి 14 లక్షల మంది మహిళా ప్రయాణికులు ఉండగా, ఇప్పుడు అది 29 లక్షలకు చేరుకుంది. పురుషులకు, విద్యార్థులకు ప్రత్యేక బస్సులు సాధ్యంకాని పక్షంలో మహిళలకు ప్రత్యేక బస్సు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు ఆలోచిస్తున్నారు. ఇదిగాని కొనసాగితే.. పురుషులకు వేరే బస్సులు, మహిళలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు కానున్నాయి. అయితే విద్యార్థులకు మరో ప్రత్యేక బస్సులను పెడితే ఇలా ఒక రెండు బస్సులు కాకుండా 3 బస్సులను ప్రత్యేకంగా నడపాల్సి ఉంటుంది. అయితే దీనిపై టీఎస్ ఆర్టీసీ, ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.
Andhra Pradesh: ఏపీ వ్యవహారాలపై కాంగ్రెస్‌ అధిష్టానం ఫోకస్‌.. వైఎస్‌ షర్మిలకు కీలక బాధ్యతలు..! నేడు ఫైనల్..!