NTV Telugu Site icon

Uttam Kumar: తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్ జరగబోతోంది.. ఉత్తమ్‌ కుమార్‌ కీలక వ్యాఖ్యలు

Uttam Kumar Reddy

Uttam Kumar Reddy

Uttam Kumar: తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 70 సీట్లు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మొత్తం 12 స్థానాలను కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందన్నారు. మీడియాతో మాట్లాడిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. ఇదే ప్రాంతం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచారని అన్నారు. తన అనుభవం, సమాచారం ప్రకారం తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్ జరగబోతోంది. నవంబరులో ఐదు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలు రాహుల్ గాంధీ ప్రధాని కావడానికి తొలి మెట్టు కానున్నాయన్నారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఐదు నుంచి ఐదు స్థానాల్లో విజయం సాధిస్తుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. రాహుల్ గాంధీ 2024 మేలో దేశానికి ప్రధాని కాబోతున్నారని అంచనాలు చెబుతున్నాయి. తెలంగాణలోని ప్రతి పౌరుడికి లక్ష రూపాయల అప్పు ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. దేశంలోనే అత్యంత అవినీతి రాష్ట్రంగా తెలంగాణ ఉందని ఆరోపించారు. గత 9 ఏళ్లలో తెలంగాణ అప్పులు భారీగా పెరిగాయని విమర్శించారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు దొంగల ముఠాల్లా ప్రజలను దోచుకుంటున్నారని ఆరోపించారు.

Read also: Secretariat: సచివాలయంలో ప్రార్థనా మందిరాలను ప్రారంభించిన సీఎం.. ఒకే వేదికపై కేసీఆర్, గవర్నర్..

ఇసుక, భూములు, గనులు, వైన్స్ ద్వారా దోచుకుంటున్నారని విమర్శించారు. ఎన్నో మోసపూరిత హామీలతో కేసీఆర్ అధికారంలోకి వచ్చారని విమర్శించారు. దళిత బంధు లో మూడు లక్షల నుండి ఐదు లక్షలు నొక్కేశారని మండిపడ్డారు. దాన డబ్బులు కూడా కొట్టేశారని ఆరోపించారు. కోదాడ..హుజుర్ నగర్ నియోజకవర్గ ములలో ఇలా జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ కి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అన్నారు. డబుల్ బెడ్ రూమ్ లో కూడా లంచాలు అంటూ మండిపడ్డారు. కేసీఆర్ తెలంగాణను ఆగం చేశారని ఆరోపించారు. అవినీతిలో ముంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ రాజకీయ ఉపన్యాసాలు చూస్తుంటే సిల్లీగా ఉందని ఎద్దేవ చేశారు. సాగర్ కట్టింది ఎవరు? ఇన్నేళ్ళు అభివృద్ధి చేసింది ఎవరు? అని ప్రశ్నించారు. త్వరలోనే అభ్యర్థుల జాబితా ప్రకటిస్తామని అన్నారు. టీఆర్ఎస్ కుటుంబ పార్టీ.. వాళ్ళు నలుగురు కూర్చొని రాయొచ్చని మండిపడ్డారు. మా పార్టీ అలా కాదని అన్నారు. కేసీఆర్ ఓటమి భయంతో రెండు చోట్లా పోటీ చేస్తానని అన్నారు. గ్యారంటీ లేదనే పోటీ చేస్తున్నారని ఎద్దేవ చేశారు. కమ్యూనిస్టులను కేసీఆర్ మోసం చేస్తారు అనేది నాకు మొదట నుండి అనుమానమే అని కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ మీద ఉమ్మడి అభ్యర్థిని పెట్టాలనే డిమాండ్ పై పార్టీ స్పందిస్తుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
Pushpa: 2024లో రూలర్ వస్తున్నాడు!