Site icon NTV Telugu

MLC Kavitha: నీళ్లు ఇచ్చేవాళ్లు కావాలా ..కన్నీళ్లు ఇచ్చేవాళ్లు కావాలా ?

Mlc Kavitha

Mlc Kavitha

MLC Kavitha: నీళ్లు ఇచ్చేవాళ్లు కావాలా లేదా కన్నీళ్లు ఇచ్చేవాళ్లు కావాలా ? అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. బోధన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. నవిపేటలో ఎమ్మెల్సీ కవిత రోడ్ షో నిర్వహించారు. అనంతరం కవిత మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ వచ్చి బిర్యాని, పాన్ తిని వెళ్ళిపోతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీలు చుట్టపు చూపుగా ఇలా వచ్చిపోతుంటారని అన్నారు. అండగా నిలిచిన ప్రతిసారి తెలంగాణను నిండా ముంచిది గాంధీ కుటుంబం అన్నారు. తెలంగాణకు తీరని మోసం చేసిన గాంధీ కుటుంబం అన్నారు. వందలాది మంది యువతను కాంగ్రెస్ పార్టీ బలితీసుకుందని అన్నారు.

Read also: Kuna Ravi Kumar: బీసీలు బాగుపడితే.. సీఎం జగన్‌కు కడుపు మంట: రవికుమార్

ప్రత్యేక తెలంగాణ ఆలస్యం కావడంతో అనేక మంది ఆత్మబలిదానాలు అని తెలిపారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో కాంగ్రెస్ చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుందని అన్నారు. నీళ్లు ఇచ్చేవాళ్లు కావాలా లేదా కన్నళ్లు ఇచ్చేవాళ్లు కావాలా ? అని ప్రశ్నించారు. రైతు బంధు కావాలా లేదా రాబంధు కావాలా ? అని తెలిపారు. కాంగ్రెస్ మూడు గంటల కరెంటు కావాలా… బీఆర్ఎస్ 24 గంటల కరెంటు కావాలా ? అని ప్రజలను అడిగారు. కాంగ్రెస్ పాలనలో చూసిన దారుణమైన పరిస్థితులు కావాలా ? అని కవిత ప్రజలను అడిగారు.
CM Siddaramaiah: బీజేపీ, బీఆర్ఎస్ నేతలు కర్ణాటకకు రండి.. ఎవిడెన్స్ లతో సహా చూపిస్తాం

Exit mobile version