NTV Telugu Site icon

MLA Raja Singh: అసదుద్దీన్ ఇల్లు కూడా ప్రభుత్వ స్థలం లో కట్టుకున్నాడు

Mla Rajasingh

Mla Rajasingh

MLA Raja Singh: రేవంత్ రెడ్డి వాళ్ళకి భయపడొద్దని బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ అన్నారు. చెరువును ఆక్రమించి ఒవైసీ బిల్డింగ్ కట్టారన్నారు. అయ్యా జాగీరు లాగా కాలేజ్ కట్టుకున్నారని తెలిపారు. అప్పుడు వాళ్ల గులాం పార్టీ బీఆర్ఎస్‌ అధికారం లో ఉండే.. దాని జోలికి వస్తె 40 వేల యువకులు చూసుకుంటారని అక్బరుద్దీన్ ఒవైసీ బెదిరిస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డి వాళ్ళకి భయపడొద్దని తెలిపారు. మీరు తీసుకున్న సంకల్పంతో ముందుకు వెళ్ళాలన్నారు. చెరువులో కబ్జాల ను తొలగించండన్నారు. వీళ్ళు (ఈ కుక్కలు) గతంలో కిరణ్ కుమార్ రెడ్డీ నీ కూడా భయపెట్టాలని చూశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన భయ పడలేదు… ఇద్దరినీ జైల్ కు పంపించారన్నారు. మీరు కూడా భయపడవద్దన్నారు. అసదుద్దీన్ ఇల్లు కూడా ప్రభుత్వ స్థలం లోనే కట్టుకున్నాడు.. దాని సంగతి కూడా చూడాలన్నారు.

Read also: D. Sridhar Babu: తెలంగాణ ప్రజలకు ఐటీ మంత్రి విజ్ఞప్తి.. ఏమన్నారంటే..

దాని పైకి కూడా బుల్డోజర్ పోవాలన్నారు. నా నియోజక వర్గంలో కూడా ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురయ్యాయన్నారు. హైదరాబాద్ కలెక్టర్ పట్టించుకోవడం లేదన్నారు.
నగరంలోని బండ్లగూడ ప్రాంతంలోని 30 ఎకరాల చెరువులో 12 ఎకరాలను ఒవైసీ సోదరులు కబ్జా చేశారని ఆరోపణలు వచ్చాయి. చదువు పేరుతో ఒవైసీ సోదరులు అసదుద్దీన్, అక్బరుద్దీన్ లు కోటాను కొల్లగొట్టారని మండిపడ్డారు. నాడు బీఆర్‌ఎస్ చెరువును స్వాధీనం చేసుకుని కళాశాలలు నిర్మించారు. అదేవిధంగా నేడు చెరువుల పరిరక్షణకు చేస్తున్న కృషికి సీఎం రేవంత్ రెడ్డిని అభినందించారు. అయితే సోదరులిద్దరూ రేవంత్‌ని కూడా భయపెట్టాలని చూస్తున్నారని రాజాసింగ్ ఆరోపించారు.

Read also: MLC Madhusudanachary: కవితను ఐదు నెలలు కుట్రతో జైలులో పెట్టారు..

కావాలంటే మళ్లీ తనపై బుల్లెట్ల వర్షం కురిపించండని.. అయితే ఆ పాఠశాలను కూల్చకండి అంటూ ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బండ్లగూడలోని ఫాతిమా ఒవైసీ కాలేజీని ‘హైడ్రా’ కూల్చివేయబోతోందన్న వార్తలపై ఈరోజు ఆయన తొలిసారి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బండ్లగూడలో ఫాతిమా ఒవైసీ పేరుతో 12 భవనాలతో కళాశాలను నిర్మించామన్నారు. ఇప్పుడు కొందరు తమను తప్పుగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. గతంలో తనపై కాల్పులు జరిగాయని, ఇకపై తనపై బుల్లెట్ల వర్షం కురిపించను అంటూ భావోద్వేగానికి గురయ్యాడు. కత్తులతో దాడి.. కానీ పేద విద్యార్థుల అభివృద్ధికి పాటుపడుతున్న విద్యాసంస్థను అడ్డుకోవద్దని అక్బరుద్దీన్ ఒవైసీ కోరారు.
MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు బెయిల్‌..

Show comments