Site icon NTV Telugu

పీసీసీపై సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు..

టీపీసీసీపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డికి పీసీసీ ఏ ఒక్క నేత చెబితే రాలేదని.. కార్యకర్తలు, పబ్లిక్ పల్స్ తెలుసుకొని.. సోనియా గాంధీ పీసీసీ ఇచ్చారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొస్తారనే రేవంత్ కు పీసీసీ ఇచ్చారని వెల్లడించారు. పీసీసీ వస్తుందని తెలిసి.. దళిత సాధికారత అని సీఎం కేసీఆర్ కొత్త నాటకం ఆడుతున్నారని సీతక్క మండిపడ్డారు. దళితులకు మూడెకరాలు అని చెప్పి.. కాంగ్రెస్ ఇచ్చిన అసైన్డ్ భూములను లాక్కుంటున్నాడని ఫైర్‌ అయ్యారు. కాంగ్రెస్ తెచ్చిన సబ్ ప్లాన్ ను తుంగలో తొక్కి.. ఎంపవర్మెంట్ అని డ్రామాలడుతున్నారని మండిపడ్డారు.

read also : మొక్కలు నాటిన చిన్నారులు.. మెచ్చుకున్న మంత్రి కేటీఆర్‌

ఖమ్మం నుంచి ఒక దళిత మహిళ మరియమ్మ తీసుకొచ్చి.. భువనగిరిలో కొట్టి చంపారంటే ఎంత దౌర్జన్యం ఉందో తెలుస్తోందన్నారు. హైదరాబాద్ చుట్టూ విలువైన భూములను అమ్ముతున్నారని.. పేదలకు 125 గజాల స్థలం ఇవ్వడానికి మనసురాదని ఫైర్‌ అయ్యారు. కాంగ్రెస్ మాత్రమే.. నిరుపేద వర్గాలకు అండగా ఉంటుందన్నారు. మోసం చేయడంలో, మభ్యపెట్టడంలో కేసీఆర్ దిట్ట అని… ఇక కేసీఆర్ మాయలను కట్టిపెట్టి కాంగ్రెస్ ను బలోపేతం చేద్దామని పిలుపునిచ్చారు.

Exit mobile version