Site icon NTV Telugu

Kishan Reddy: ఎయిర్‌పోర్ట్‌ని తలదన్నే విధంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్

Kishan Reddy Sec Railway

Kishan Reddy Sec Railway

Secunderabad Railway Station Will Be Developed As Airport Says Kishan Reddy: ఎయిర్‌పోర్ట్ తరహాలో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేస్తామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఆధునికీకరణపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. రూ.719.30 కోట్లతో స్టేషన్‌ అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచినట్లు పేర్కొన్నారు. ఈ నిధులతో రైల్వేస్టేషన్‌ ప్లాట్‌ఫార్మ్‌లను పూర్తిగా ఆధునీకరిస్తామని వెల్లడించారు. పార్కింగ్‌ సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని.. 26 ఆధునిక లిఫ్టులు, 32 ఎస్కలేటర్లు, 4 అంతస్తుల్లో కారు పార్కింగ్, 2 ట్రావెలేటర్లు నిర్మించనున్నామని చెప్పారు. దక్షిణ భారతదేశంలోనే ఉత్తమ రైల్వే స్టేషన్‌గా సికింద్రాబాద్‌ను తీర్చిదిద్దుతామని అన్నారు. అది కూడా కేవలం మూడు సంవత్సరాలలోనే.. మూడు దశల్లో అభివృద్ధి పనులు పూర్తి చేయాలని నిర్ణయించుకున్నామన్నారు. ఈ కొత్త ఏర్పాట్లతో.. రానున్న 30 ఏళ్లకు సరిపడ వసతులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అందుబాటులోకి వచ్చినట్లేనని కిషన్ రెడ్డి చెప్పారు.

అటు.. కాజీపేటలో కూడా రూ.384 కోట్లతో వ్యాగన్‌ వర్క్‌షాప్‌ కోసం టెండర్లు పిలిచామని, దీని కోసం 150 ఎకరాల భూసేకరణ పనులు కొనసాగుతున్నాయని కిషన్ రెడ్డి అన్నారు. ఎంఎంటీఎస్‌ రెండోదశ పనులకు రాష్ట్రం నిధులు ఇవ్వాల్సి ఉందని, వాటిని విడుదల చేస్తే పనులు త్వరగా పూర్తవుతాయని చెప్పారు. విజయవాడ, సికింద్రాబాద్‌ మార్గంలో వందేభారత్‌ రైళ్లు కూడా రాబోతున్నాయని.. వాటిని తిరుపతి వరకు పొడిగించాలని రైల్వేశాఖను కోరామన్నారు. ఇదిలావుండగా.. న్యూ ఢిల్లీ, అహ్మదాబాద్, ఛత్రపతి శివాజీ టర్మినస్ రైల్వే స్టేషన్లను కూడా ఆధునీకరణ చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. ఇందుకు మొత్తం రూ. 10,000 కోట్లు నిధులు కేటాయించేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆల్రెడీ న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ ఎలా ఉండబోతోందన్న మాస్టర్ ప్లాన్‌ని విడుదల చేశారు. ఎయిర్‌పోర్ట్‌ని తలదన్నే విధంగా ఢిల్లీ ఎయిర్‌పోర్టుని నిర్మించనున్నారు. రూ. 4,700 కోట్ల వ్యయంతో 2030 కల్లా ఈ స్టేషన్‌ని నిర్మించాలని పక్కా ప్లాన్ వేశారు.

Exit mobile version