Avinash Mohanty IPS: మియాపూర్, చందనగర్ పరిధిలో 144 సెక్షన్ అమలులో ఉందని సైబరాబాద్ సీపీ అవినాష్ మొహంటీ అన్నారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించడానికి వచ్చిన వారిని ఖాళీ చేయించామన్నారు. నిన్న పోలీసులపై కొంత మంది రాళ్లు విసిరారని తెలిపారు. లా అండ్ ఆర్డర్ తప్పేలా ….వ్యవహరించారని మండిపడ్డారు. వారిపై కేస్ లు నమోదు చేసామన్నారు. ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకోవచ్చు అని ప్రజలను తప్పుదోవ పట్టించారని పేర్కొన్నారు. దీనికి వెనుక ఉన్న వారిపై కేస్ లు నమోదు చేశామన్నారు. ప్రభుత్వ భూమి కాబట్టి నేటి నుండి ప్రత్యేక భద్రత ను ఏర్పాటు చేసామన్నారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించు కోవచ్చు అని వచ్చే వదంతులు నమ్మవద్దన్నారు. దాదాపు వెయ్యి మంది ఫోర్స్ ని ల్యాండ్ దగ్గర పెట్టామన్నారు. ఈ పరిసరాల్లో అనుమానస్పదం గా తిరిగితే అరెస్ట్ లు ఉంటాయని తెలిపారు. దీంతో మియాపూర్ లోని సర్వే నెంబర్ 100, 101 వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు.
Read also: Kaushik Reddy: మేము అధికారంలోకి వస్తాం.. అప్పుడు మీకు బ్లాక్ డెస్..
వెయ్యి మంది పోలీసులతో భద్రతను అధికారులు ఏర్పాటు చేశారు. భూమి చుట్టూ ఉన్న రోడ్ల వద్ద బారికెట్లు వేసి లోపలికి ఎవరిని అనుమతించమని క్లారిటీ ఇచ్చారు. 450 ఎకరాలు ప్రభుత్వ భూమి హెచ్ఎండిఏ ఆధీనంలో ఉందని ఎస్టేట్ ఆఫీసర్ పేర్కొన్నారు. కావాలని కొంతమంది వదంతులు సృష్టించి గుడిసెలు వేసుకోవచ్చని వాట్సప్ లలో పెట్టడంతో రాష్ట్రవ్యాప్తంగా ఒక వర్గానికి చెందిన ప్రజలు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఆక్రమించడానికి ప్రయత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ల్యాండ్ మొత్తం గుట్టలతో అడవి లాగ ఉండడంతో ఇంకా కొంతమంది చెట్ల కింద బండరాయలు కింద ఉన్నవారిని గుర్తించి బయటకు పోలీసులు పంపించారన్నారు. డ్రోన్ కెమెరాలు సహాయంతో రెండు సర్వే నెంబర్లలో ఉన్న భూమిలో జల్లెడ పడుతున్నారని తెలిపారు. ఇప్పటికే భూ ఆక్రమణ కేస్ లో 20మంది పై కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. సంఘటనా స్థలానికి సీపీ అవినాష్ మొహంటీ చేరుకుని ఎటువంటి ఆటంకాలు జరగకుండా పరిశీలిస్తున్నారు.
Legal Notices: మంత్రి పొన్నంపై ఆరోపణలు.. పాడి కౌశిక్ రెడ్డికి లీగల్ నోటీసులు..