Site icon NTV Telugu

హుజురాబాద్ నామినేషన్ కేంద్రం వద్ద 144 సెక్షన్…

huzurabad

huzurabad

కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాలు మొత్తం హుజురాబాద్ చుట్టూనే తిరుగుతున్నాయి. ఇక ఈ మధ్యే హుజురాబాద్ ఎన్నిక షెడ్యూల్ విడుదల కాగా నేడు నోటిఫికేషన్ అమల్లోకి వచ్చింది. ఈ విషయం పై ఆర్డీవో రిటర్నింగ్ అధికారి రవిందర్ రెడ్డి మాట్లాడుతూ… హుజురాబాద్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ అమల్లోకి వచ్చింది. నామినేషన్ల ప్రక్రియ ఈరోజు నుండి ప్రారంభం అవుతుంది. అయితే నామినేషన్ వేసే అభ్యర్థి తో పాటు మరో ఇద్దరికి మాత్రమే అనుమతి ఉంది. 11 నుండి మూడు గంటల వరకూ నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. ప్రస్తుతం ఉన్న కోవిడ్ నేపథ్యంలో నామినేషన్ కేంద్రంలో కోవిడ్ నిబంధనలు తప్పకుండ పాటించాలి. ఇక నామినేషన్ కేంద్రం వద్ద ఎటువంటి గొడవలు జరగకుండా… 144 సెక్షన్ విధించి.. అలాగే రెండు అంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు రిటర్నింగ్ అధికారి.

Exit mobile version