NTV Telugu Site icon

నేటి నుంచి రెండో విడత గొర్రెల పంపిణీ

Sheep

Sheep

గొర్రెల కాపరులను లక్షాధికారులను చేస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్‌… వారి కోసం గొర్రెల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.. మొన్నమొన్నటి వరకు తొలి విడత గొర్రెల పంపిణీ చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు రెండో విడత గొర్రెల పంపిణీకి శ్రీకారం చుడుతోంది.. ఇవాళ కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు… మంత్రులు హరీష్‌రావు, గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరుకున్నారు..

రెండో విడతలో భాగంగా 3.81 లక్షల మంది గొల్ల కురుమలకు గొర్రెలను అందించనుంది సర్కార్.. ప్రతి ఒక్కరికి ఒక యూనిట్‌ (21) గొర్రెలను పంపిణీ చేయనున్నారు.. బహిరంగ మార్కెట్‌లో గొర్రెల ధర పెరిగిన నేపథ్యంలో ఇంతకు ముందు ప్రభుత్వం నిర్ణయించిన ధరకు 21 గొర్రెలు రావడం లేదనే విజ్ఞప్తుల నేపథ్యంలో.. గొర్రెల యూనిట్‌ ధరను రూ.1.25 లక్షల నుంచి రూ.1.75 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కాగా, తొలి విడతలో కొన్ని ప్రాంతాల్లో 21 గొర్రెలకు బదలుగా.. 15 మాత్రమే అందించారని.. అందులో పొటేల్‌ కూడా లేదని గొర్రెలకాపరులు ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాదు.. 21 గొర్రెలతో కూడిన యూనిట్‌ ఇచ్చినట్టు సంతకాలు చేయించుకున్నారని ఆవేదన చెందుతున్నారు.