Site icon NTV Telugu

50 శాతం టీచర్లతోనే పాఠశాలలు ప్రారంభం…

టీచర్ల ప్రమోషన్స్, బదిలీ లు, పాఠశాలల పునః ప్రారంభం పై సీఎంతో మాట్లాడాము అని తెలిపారు పిఆర్టియూ నేతలు శ్రీపాల్ రెడ్డి, కమలాకర్ రావు. స్కూల్స్ ,జూనియర్ కళాశాలల ప్రత్యక్ష తరగతులు తాత్కాలిక వాయిదాకు సీఎం హామీ ఇచ్చారు అన్నారు. గతంలో మాదిరిగానే స్కూల్స్ జూనియర్ కళాశాలల్లో ఆన్లైన్ తరగతులు జరుగుతాయని… పరిస్థితిలు చక్కబట్టాకే ప్రత్యక్ష తరగతులు ఉంటాయని తెలిపారు. ఇక 50 శాతం టీచర్ల తోనే పాఠశాలలు ప్రారంభమవుతాయని… కొత్త జిల్లాల ప్రకారమే టీచర్ల బదిలీలు, ప్రమోషన్స్ 15 రోజుల్లో పూర్తి చేస్తామని సీఎం హామీ ఇచ్చారు అని స్పష్టం చేశారు. లీగల్ గా సమస్యలు రాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు.. అలాగే 2003 టీచర్ రిక్రూట్ మెంట్ ద్వారా నియామకం అయిన ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానంకి సీఎం అంగీకరించారు అని పేర్కొన్నారు.

Exit mobile version