కరోనా సమయంలో విద్యార్థుల తల్లిదండ్రుల ముక్కుపిండి ఫీజులు వసూలు చేస్తున్నాయి కొన్ని ప్రైవేట్ స్కూళ్లు.. దీనిపై రకరకాల ఫిర్యాదులు అందగా… గతంలో ఉన్న ఫీజులు మాత్రమే.. అది కూడా కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేయాలని స్పష్టం చేసింది సర్కార్.. దీనిపై జీవో నంబర్ 75ని విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం.. అయితే, అన్ని స్కూళ్లు తమ ఫీజుల వివరాలను వెబ్‌సైట్‌లో పెట్టాలని స్పష్టం చేశారు స్కూల్ ఎడ్యుకేషన్ రీజినల్ జాయింట్ డైరెక్టర్ విజయ లక్ష్మి… ప్రభుత్వం జారీ చేసిన జీవో 75ని పకడ్బందీగా అమలు చేస్తామన్న ఆమె.. ఫిర్యాదులు వచ్చిన స్కూల్స్ లో తనిఖీలు చేయడానికి ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేస్తామన్నారు.. జీవో 75 అమలు పై డీఈవోలకు ఆదేశాలు ఇచ్చాం.. ఒరియెంటెషన్ ప్రోగ్రాం నిర్వహిస్తాం.. రాష్ట్రంలో ఉన్న అన్ని రకాల ప్రైవేట్ పాఠశాలకు ఈ జీవో వర్తిస్తుందని వెల్లడించారు. 2019-20 విద్యా సంవత్సరంలో ఉన్న ట్యూషన్ ఫీ మాత్రమే తీసుకోవాలి… ఎలాంటి ఇతర ఫీజులు తీసుకోవద్దని పేర్కొన్నారు.. ఫీజులు ఎక్కువ తీసుకుంటే తగ్గిస్తామని పేర్కొన్నారు విజయలక్ష్మి.. జీవో ప్రకారమే ఫీజులు తీసుకోవాలని ప్రైవేట్ స్కూల్స్ కి చెప్పాం.. పేరెంట్స్ ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రైవేట్ స్కూల్స్ పారదర్శకంగా ఉండాలి… ప్రభుత్వ ఉత్తర్వులు గౌరవించాలని ఆదేశించారు.
ఫీజు వివరాలు స్కూళ్లు వెబ్‌సైట్‌లో పెట్టాలి.. ఫిర్యాదులు వస్తే చర్యలు..!

Private School