NTV Telugu Site icon

Droupadi Murmu: రాష్ట్రపతికి స్వాగతం పలికిన గవర్నర్‌, మంత్రి సత్యవతి.. మళ్లీ సీఎం కేసీఆర్ డుమ్మా..

Murmu Shamshabad

Murmu Shamshabad

Droupadi Murmu: శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌ చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, మంత్రి సత్యవతి రాఠోడ్‌ స్వాగతం పలికారు. శంషాబాద్‌ నుంచి రాష్ట్రపతి నేరుగా హెలికాప్టర్‌లో శ్రీశైలం బయలుదేరారు. రోడ్డు మార్గం ద్వారా 12.05కు శ్రీశైలానికి చేరుకోనున్నారు రాష్ట్రపతి.  రాష్ట్రపతితో కలిసి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, గవర్నర్‌ తమిళిసై శ్రీశైలం వెళ్ళనున్నారు. మధ్యాహ్నం 2.45 నిమిల వరకు ఆలయ దర్శనం అనంతరం వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు సుండపెంట నుంచి బయలుదేరనున్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ముర్ము బస చేయనున్నారు. సాయంత్రం 4.15కు హకీంపేట ఎయిర్‌ ఫోర్స్‌ స్టేషన్‌ చేరుకోనున్నారు. రాష్ట్రపతి తొలిసారి తెలంగాణకు రానున్న సందర్బంగా రాష్ట్రపతికి గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్‌ ఘనంగా స్వాగతం పలకనున్నారు. సికింద్రాబాద్ యుద్ధ స్మారకం వద్ద పుష్పాంజలి ఘటిస్తారు. బొల్లారంలో వీరనారీలకు సత్కారం చేస్తారు.

Read also:Top Headlines @9AM: టాప్ న్యూస్

సీఎం కేసీఆర్ డుమ్మా:

అయితే రాష్ట్రపతిని స్వాగతం పలికేందుకు సీఎం కేసీఆర్ డుమ్మా కొట్టడంతో చర్చకు దారితీస్తోంది. గవర్నర్ తమిళిసై స్వాగతం పలికేందుకు వెళ్లిన నేపథ్యంలోనే సీఎం వెళ్లలేదని వార్తలు గుప్పు మన్నాయి. సీఎం కేసీఆర్ రాష్ట్రపతిని స్వాగతం పలికేందుకు వెళుతున్నారనే వార్తనే నిన్నటి నుంచి వచ్చిన ఇవాళ సీఎం కేసీఆర్ వెళ్లకపోవడం మళ్లీ చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రపతి ఐదు రోజులు తెలంగాణలో పర్యటించనున్నారు. అది కూడా తెలంగాణలో రాష్ట్రపతి పర్యటన కూడా తొలిసారి అయినా సీఎం కేసీఆర్ రాష్ట్రపతిని వెళ్లి కలవకపోవడం, స్వాగతం పలికేందుకు డూమ్మాకొట్టడం సంచలనంగా మారింది. మరి ఐదురోజుల పర్యటనలో అయినా రాష్ట్రపతిని సీఎం వెళ్లి కలుస్తారా? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రపతి వచ్చినా కూడా సీఎం కేసీఆర్ ఒక మంత్రిని పంపడం ఏంటని పలువురు ప్రశ్నించుకుంటున్నారు.

రాష్ట్రపతి పర్యటన షెడ్యూల్

డిసెంబర్‌ 26

12.15 నుండి 12.45 వరకు శ్రీశైలం పర్యటన.. మధ్యాహ్నం 3.05 – 3.15 సికింద్రాబాద్ బొల్లారంలోని యుద్ధ స్మారకం వద్ద పుష్పాంజలి. వీరనారీలకు సత్కారం.

డిసెంబర్ 27 

ఉదయం 10.30 – 11.30 నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ విద్యాసంస్థలో విద్యార్థులు, ఫ్యాకల్టీతో సమావేశం

మధ్యాహ్నం 3.00- 4.00 సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో అఖిల భారత పోలీస్ సేవల 74వ బ్యాచ్ ట్రైనీ అధికారులతోపాటు భూటాన్, నేపాల్, మారిషస్ మాల్దీవుల దేశాల అధికారులతో సమావేశం

డిసెంబర్‌ 28

ఉదయం 10.40 – 11.10 భద్రాచలంలోని సీతారామచంద్ర స్వామి ఆలయ సందర్శన. ప్రసాద్ పథకం ప్రారంభం. అనంతరం మిశ్ర ధాతు నిగం లిమిటెడ్(మిథాని)కి సంబంధించిన వైడ్ ప్లేట్ మిల్ ప్లాంట్ ను వర్చువల్ లు ప్రారంభిస్తారు.

మధ్యాహ్నం 3.00-3.30 వరంగల్‌లోని రామప్ప ఆలయ సందర్శన. ప్రసాద్ ప్రాజెక్టు ప్రారంభం… ప్రాజెక్ట్ లకు శంకుస్థాపన

డిసెంబర్‌ 29

ఉదయం 11.00-12.00 షేక్‌పేటలోని జి.నారాయణమ్మ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మహిళా కళాశాల సందర్శన. విద్యార్థులు, ఫ్యాకల్టీతో సమావేశం.

సాయంత్రం 5.00-6.00 శంషాబాద్‌లోని శ్రీరామ్‌నగర్‌లో సమైక్యతామూర్తి (శ్రీ రామానుజాచార్య) విగ్రహ సందర్శన

డిసెంబర్ 30

ఉదయం 10.00-11.00 రంగారెడ్డి జిల్లాలోని కన్హా శాంతి వనంలో శ్రీ రామచంద్ర మిషన్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన అంగన్వాడీ, ఆశా వర్కర్లను ఉద్దేశించి ప్రసంగం.

అనంతరం సాంస్కృతిక మంత్రిత్వశాఖ, శ్రీ రామ చంద్ర మిషన్ కలిసి చేపడుతున్న ‘హర్ దిల్ ధ్యాన్, హర్ దిన్ ధ్యాన్’ ప్రచార కార్యక్రమం ప్రారంభం.

మధ్యాహ్నం 1.00గంటకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో విందు ఇవ్వనున్న రాష్ట్రపతి

Show comments