Site icon NTV Telugu

Satyavathi Rathod : మహిళా దినోత్సవ వేడుకలు 3 రోజులు

ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను మూడు రోజులు జరపాలని పార్టీ నిర్ణయం తీసుకుందని మంత్రి సత్యవతి రాథోడ్ వెల్లడించారు. 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మహిళా దినోత్సవం వేడుకలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు.టీఆర్‌ఎస్ ప్రభుత్వం వల్ల మహిళలకు అందిన ఫలాల గురించి వివరించబోతున్నామని, 6వ తేదీన గ్రామంలో కేసీఆర్ ఫొటోకు రాఖీ కట్టే కార్యక్రమం నిర్వహించబోతున్నట్లు ఆమె తెలిపారు. అంతేకాకుండా 7వ తేదీన కళ్యాణలక్ష్మీ- కేసీఆర్ కిట్- అందిన కుటుంబాలతో భేటీలు నిర్వహిస్తామన్నారు. కరోనా సమయంలో మహిళలకు- గర్భిణీలకు ఇబ్బంది లేకుండా చూసుకున్నామని ఆమె అన్నారు. సీఎం కేసీఆర్‌ మహిళలకు సంక్షేమం అనేక పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చారని, కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌తో ప్రతి ఆడబిడ్డకి అండగా ఉంటున్నారన్నారు.

Exit mobile version