Warangal: రవితేజా హీరో నటించిన ఇడియట్ సినిమా చూసే ఉంటారు కదా. అందులో హీరోయిన్ గా రక్షిత.. హీరోయిన్ ఫాదర్ గా ప్రకాశ్ రాజ్ నటించారు. ఈ సినిమాలో ఓ డైలాగ్ ఫేమస్.. అదే కమిషనర్ కూతుర్లకు మొగుల్లు రా..రా..? అయితే.. అందులో ప్రకాశ్ రాజ్ రోల్ సిటీ కమీషనర్ (సీపీ) కూతుర్ని హీరో రవితేజ ఇష్టపడటంతో ఈ కథ అంతా నడుస్తుంది. దీంతో అది నచ్చని ప్రకాష్ రాజ్ హీరోకి నరకం చూపిస్తాడు. చివరకు హీరోయిన్ కూడా హీరోని ప్రేమించడంతో సీపీగా ప్రకాష్ రాజ్ తన ప్రతాపం చూపించడం స్టార్ట్ చేస్తాడు.. ఇదంతా సినిమా అయినా జీవితంలో సేమ్ సిచ్ వేషన్ ఎదురైతే ఎలా ఉంటుంది. ఇక్కడ కొంచెం సీన్ రివర్స్ సీపీ కూతురు కాదు.. సర్పంచ్ కూతురు ప్రేమలో పడింది. దీంతో సర్పంచ్ ఏం చేశాడనేది అసలు కథ..
Read also: Cabinet Meet: మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ.. బండి సంజయ్ నిరాకరిస్తే.. ఎవరికి చోటుపై చర్చ
నర్సంపేట మండలం ఇటిక్యాలపల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ రవీందర్ కుమార్తె కావ్యశ్రీ హసన్‌పర్తి పరిధిలోని హాస్టల్‌లో చదువుతోంది. అయితే కాశ్య శ్రీ తన గ్రామానికి చెందిన జలగం రంజిత్ అనే యువకుడితో ప్రేమలో పడింది. కొంతకాలంగా వీరి ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఇటీవలే ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పగా.. ఇరు కుటుంబాలు అంగీకరించలేదని తెలుస్తోంది. వారిద్దరూ ఇటీవలే పెళ్లి చేసుకున్నారు, తల్లిదండ్రుల మాట కాదనడంతో.. గ్రామానికి చెందిన పలువురు స్నేహితులు కూడా వారికి సహకరించారు. కొందరు స్నేహితుల సమక్షంలో దండలు మార్చుకుని పెళ్లి చేసుకున్నారు. తన కూతురు ప్రేమించిన వ్యక్తినే పెళ్లిచేసుకుందని ఆమె తండ్రి, గ్రామ సర్పంచ్ రవీందర్ జీర్ణించుకోలేకపోయాడు. హసన్‌పర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Read also: Rangoli: పాతబస్తీలో విషాదం.. ప్రాణం తీసిన ‘ముగ్గు’ వివాదం
తన కూతురిని ప్రేమ పేరుతో పెళ్లి చేసుకున్నాడని రంజిత్ పై ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు కావ్య, రంజిత్‌లను స్టేషన్‌కు పిలిపించారు. ఈ సందర్భంగా తండ్రి.. కూతురు కావ్వను ఇంటి రావాలని ఒత్తిడి చేశాడు. అయితే కూతురు తనతో రావడానికి నిరాకరించడంతో రంజిత్‌పై సర్పంచ్ రవీందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. పోలీస్ స్టేషన్ నుంచి ఆగ్రహంతో స్వగ్రామానికి వచ్చిన సర్పంచ్ రవీందర్ రంజిత్ ఇంటితో పాటు అతనికి పూర్తిగా సహకరించిన మరో ఇద్దరు స్నేహితుల ఇళ్లకు నిప్పుపెట్టాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. గ్రామంలో ఎలాంటి గొడవలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇళ్లు పూర్తిగా కాలిపోవడంతో బాధితులు నిరాశ్రయులయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కర్కశంగా ప్రవర్తించిన సర్పంచ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, వెంటనే అరెస్ట్ చేయాలని బాధితులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. కూతురు ప్రేమ వివాహం కారణంగా ఇళ్లకు నిప్పంటించిన ఈ ఘటన ప్రస్తుతం గ్రామంలో కలకలం రేపుతోంది.
Niharika-Chaitanya Divorce: విడాకులపై స్పందించిన నిహారిక.. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్!