Ponnam Prabhakar: గురుకులం విద్యార్థులకు వైద్య పరీక్షలు.. అధికారులకు మంత్రి పొన్నం ఆదేశం
- రాష్ట్రంలో బీసీ-ఎస్సి-ఎస్టీ మైనారిటీ గురుకులలో చదివే విద్యార్థులకు వైద్య పరీక్షలు..
- పెద్దాపుర్ సాంఘిక సంక్షేమ పాఠశాలలో ఘటనలు పునరావృతం కాకుండా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి..
- గురుకుల పాఠశాల తరగతి గదులు శుభ్రంగా ఉండేలా ప్రిన్సిపల్ జాగ్రత్త చర్యలు చేపట్టాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponnam Prabhakar: రాష్ట్రంలో బీసీ,ఎస్సి,ఎస్టీ మైనారిటీ గురుకులలో చదివే విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని రవాణా, బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం పెద్దాపుర్ సాంఘిక సంక్షేమ పాఠశాలలో జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి గురుకుల పాఠశాల ఆవరణ లో, హాస్టల్ లు, తరగతి గదులు శుభ్రంగా ఉండేలా ప్రిన్సిపల్ జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని బీసీ, ఎస్సి, ఎస్టీ, మైనారిటీ గురుకుల పాఠశాలలో చదివే విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. వర్షాకాలం సీజనల్ వ్యాధులు అధికంగా వస్తున్న నేపథ్యంలో గురుకుల పాఠశాలలో చదివే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి గురుకుల పాఠశాలలో వాటర్ ట్యాంకులు శుభ్రం చేయాలి.తాగునీటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలకి అస్వస్థతగా ఉన్న ఏఎన్ఎం పర్యవేక్షణలో చికిత్స అందించాలన్నారు.
Read also: Farmers Loan Waiver: రూ.31 వేల కోట్ల రుణమాఫీ.. దేశంలోనే తెలంగాణ కొత్త రికార్డు..
Also Read
- JNTU Sultanpur : జేఎన్టీయూ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. ఇద్దరు సీనియర్లు సస్పెండ్
- Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
- Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
- Massive Accidents : NH-65పై మృత్యుఘోష.. ఒకే రోజు 9 మంది బలి.!
పిల్లల హైట్, వెయిట్ రికార్డు చేయాలి. విద్యార్థులకు నాణ్యమైన మంచి పోషకాహారం అందించాలి. ఆహారం వండేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. పరిసరాల శుభ్రత, తరగతి గది హాస్టల్ గది శుభ్రతపై పిల్లలకి అవగాహన కల్పించాలి. పిల్లలకు హిమోగ్లోబిన్, విటమిన్-డి లాంటి పరీక్షలు నిర్వహించాలి. పాఠశాలలో ఆవరణలో శుభ్రంగా ఉంచాలని గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ లను ఆదేశించారు. ఇటీవల జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం పెద్దపూర్ సాంఘిక సంక్షేమ పాఠశాలలో జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, జిల్లాలో ఉన్న గురుకుల పాఠశాలలను పర్యవేక్షించాలని సూచించారు.
Female Doctor Murder: కోల్‌కతాలో డాక్టర్ హత్య.. హైదరాబాద్ లో జూడాల నిరసనలు..
తాజావార్తలు
-
Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
-
Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
-
Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. ‘దొంగ నా కొడుకు’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!