NTV Telugu Site icon

Ponnam Prabhakar: గురుకులంలో చదివే విద్యార్థులకు వైద్య పరీక్షలు.. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశం

Ponnam Prabhakar

Ponnam Prabhakar

Ponnam Prabhakar: రాష్ట్రంలో బీసీ,ఎస్సి,ఎస్టీ మైనారిటీ గురుకులలో చదివే విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని రవాణా, బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం పెద్దాపుర్ సాంఘిక సంక్షేమ పాఠశాలలో జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి గురుకుల పాఠశాల ఆవరణ లో, హాస్టల్ లు, తరగతి గదులు శుభ్రంగా ఉండేలా ప్రిన్సిపల్ జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని బీసీ, ఎస్సి, ఎస్టీ, మైనారిటీ గురుకుల పాఠశాలలో చదివే విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. వర్షాకాలం సీజనల్ వ్యాధులు అధికంగా వస్తున్న నేపథ్యంలో గురుకుల పాఠశాలలో చదివే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి గురుకుల పాఠశాలలో వాటర్ ట్యాంకులు శుభ్రం చేయాలి.తాగునీటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలకి అస్వస్థతగా ఉన్న ఏఎన్ఎం పర్యవేక్షణలో చికిత్స అందించాలన్నారు.

Read also: Farmers Loan Waiver: రూ.31 వేల కోట్ల రుణమాఫీ.. దేశంలోనే తెలంగాణ కొత్త రికార్డు..

పిల్లల హైట్, వెయిట్ రికార్డు చేయాలి. విద్యార్థులకు నాణ్యమైన మంచి పోషకాహారం అందించాలి. ఆహారం వండేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. పరిసరాల శుభ్రత, తరగతి గది హాస్టల్ గది శుభ్రతపై పిల్లలకి అవగాహన కల్పించాలి. పిల్లలకు హిమోగ్లోబిన్, విటమిన్-డి లాంటి పరీక్షలు నిర్వహించాలి. పాఠశాలలో ఆవరణలో శుభ్రంగా ఉంచాలని గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ లను ఆదేశించారు. ఇటీవల జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం పెద్దపూర్ సాంఘిక సంక్షేమ పాఠశాలలో జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, జిల్లాలో ఉన్న గురుకుల పాఠశాలలను పర్యవేక్షించాలని సూచించారు.
Female Doctor Murder: కోల్‌కతాలో డాక్టర్‌ హత్య.. హైదరాబాద్‌ లో జూడాల నిరసనలు..