Site icon NTV Telugu

Patancheru Blast: పాశమైలారం ప్రమాదం: గుర్తించిన మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి

Ptc

Ptc

Patancheru Blast: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులోని ప్రభుత్వ ఆస్పత్రిలో మార్చురీలో హృదయవిదారక దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. ఈ రోజు ( జూలై 1న) పటాన్‌చెరువు సర్కారు దవాఖానలోని మార్చురీలో ఉన్న మృతదేహాలు చూసి కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఏ మృతదేహం ఎవరిదో తెలియక మార్చురీ దగ్గర కార్మికుల కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. డీఎన్ఎ రిపోర్ట్ వచ్చిన తర్వాత వైద్య శాఖ అధికారులు మృతదేహాలను బంధువులకు అప్పగిస్తున్నారు. అయితే, ఇప్పటి వరకు పటాన్ చెరువు మార్చురీలో గుర్తించిన మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేశారు డాక్టర్లు.

Read Also: Pashamylaram Blast: పటాన్ చెరువు కెమికల్ ఫ్యాక్టరీలో మృతులకు కోటి రూపాయల పరిహారం ఇవ్వాలి..

కాగా, పోస్టుమార్టం పూర్తి అయిన 11 మంది మృతదేహాలను కుటుంబ సభ్యులకు అధికారులు అప్పగించారు. వీరిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు నలుగురు ఉండగా తెలంగాణకు చెందిన వారు ఒకరు.. ఒరిస్సా కు చెందిన వారు ముగ్గురు, బీహార్ కు చెందిన వారు ఇద్దరు ఉన్నారు.

* పోస్టుమార్టం పూర్తయిన వారి వివరాలు..
1. రాజనాల జగన్మోహన్, ఒరిస్సా
2. రామ్ సింగ్ రాజ్ బార్, యూపి
3. శశి భూషణ్ కుమార్, బీహార్
4. లగ్నజిత్ దావూరి, ఒరిస్సా
5. హేమ సుందర్, చిత్తూరు
6. రక్సూనా ఖాతూన్, బీహార్
7. నిఖిల్ రెడ్డి, కడప
8. నాగేశ్వరరావు, మంచిర్యాల
9. పోలిశెట్టి ప్రసన్న, ఈస్ట్ గోదావరి
10. శ్రీ రమ్య, కృష్ణా జిల్లా
11. మనోజ్ , ఒరిస్సా

Exit mobile version