NTV Telugu Site icon

Damodar Raja Narasimha:114 జీవో చూడండి.. హరీష్ రావుకు దామోదర కౌంటర్..

Damodara Raja Narasimha

Damodara Raja Narasimha

Damodar Raja Narasimha: జీవో 33ని వ్యతిరేకించేవాళ్ళు 114 జీవో చూడండి మీకే తెలుస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు కు మంత్రి దామోదర రాజనర్సింహ కౌంటర్ ఇచ్చారు. ఆ జీవోని ఈ జీవోని పోల్చుకుని చూడండి అర్థం అవుతుందన్నారు. సంగారెడ్డి జిల్లాలో మంత్రి దామోదర రాజనర్సింహ పర్యటించిన ఆయన మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు.

Read also: Ganja Gang Arrest: తీగ లాగితే క‌దిలిన డొంక‌.. గంజాయి విక్రయిస్తున్న ముఠా అరెస్ట్

నిన్న తెలంగాణ ప్రభుత్వం కొత్త విధానాలతో ఇక్కడ తెలంగాణ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని., కనీస అవగాహన లేకుండా ఎంబీబీస్ సీట్ల కోసం ప్రభుత్వం జీవో తెచ్చిందని తెలిపిన విషయం తెలసిందే. అసలు అధ్యయనం చేయకుండా తెచ్చిన ఈ జీవో వల్ల స్థానికులు స్థానికేతారులుగా మారుతారని., మేము తెచ్చిన జీవో తో విద్యార్థులకు న్యాయం జరిగిందని, మా హయాంలో 30 వరకు కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామన్నారు. 95 శాతం పైగా ఉద్యోగాలు తెలంగాణ వాళ్ళకే వచ్చే విదంగా మేము చేశామని, బి కేటగిరీలో కూడా తెలంగాణ వాళ్ళకే సీట్లు ఎక్కువగా ఇచ్చాము. కొత్తగా ఏర్పాటు చేసిన కాలేజీల్లో రిజర్వ్డ్ కోటా లేకుండా చేశారు. వరుసగా నాలుగేళ్లు తెలంగాణలో చదవకుంటే నాన్ లోకల్ అని ప్రభుత్వం కొత్తగా జీవో తెచ్చింది. ఈ నాలుగేళ్ల నిబంధన తెలంగాణ వాళ్లకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఇంటర్ తో పాటు లాంగ్ టర్మ్ కోసం వేరే రాష్ట్రాలకు వెళతారు, ఇలా వరుసగా నాలుగేళ్ళు చదవకుంటే నాన్ లోకల్ అని ప్రభుత్వం జీవో ఇచ్చిందని., మెడిసిన్ ప్రవేశాలకు సమగ్ర ప్రణాళిక ఈ ప్రభుత్వానికి లేదని , జీవో 33 సక్రమంగా లేదు.. దీనివల్ల తెలంగాణ విద్యార్థుల కు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆయన వాపోయారు. తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరగకుండా ఉండేందుకు అఖిలపక్షం ఏర్పాటు చేయలని., మేము వచ్చి మీకు సలహాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని., ప్రభుత్వం వెంటనే హై లెవల్ కమిటీ వేసి ఈ స్థానికత పై చర్చించాలన్న విషయం పై దామోదర కౌంటర్ ఇచ్చారు.
Karimnagar: వీధి కుక్కల దాడిలో చిన్నారికి తీవ్ర గాయాలు..

Show comments