NTV Telugu Site icon

Jaggareddy: హోలీ వేడుకల్లో డప్పు కొట్టి డ్యాన్స్ చేసిన జగ్గారెడ్డి

Jaggareddy

Jaggareddy

Jaggareddy: కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హోలీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. సంగారెడ్డి పట్టంలోని రామ్ నగర్ కాలనీలో తన చిన్న నాటి మిత్రులతో కలిసి కాముని దహన వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన చిన్నప్పటి దోస్తులతో కాసేపు ముచ్చిటించిన తర్వాత కాముని దహనం ప్రక్రియలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డప్పు కొడుతూ.. డ్యాన్స్ చేస్తూ అక్కడ ఉన్న వాళ్లందరిని ఉత్సాహపరిచాడు.

Read Also: Nara Lokesh: మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు.. పాల్గొన్న లోకేష్‌ దంపతులు

ఇక, హోలీ వేడుకల్లో జగ్గారెడ్డి పాల్గొంటే ఆ కిక్కే వేరప్పా అని అతడి స్నేహితులు, కాలనీ వాసులు, కాంగ్రెస్ కార్యకర్తలు అంటున్నారు. జగ్గారెడ్డి ఉన్న చోట సంతోషం వెల్లివిరుస్తుందని పేర్కొన్నారు. ఇక, జగ్గారెడ్డి మాట్లాడుతూ.. నా చిన్నప్పటి నుంచి ఇలా హోలీ జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తనకు కావాల్సిన ప్రతి ఒక్కరు ఇక్కడే ఉన్నారు.. సంగారెడ్డి ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని జగ్గారెడ్డి తెలిపారు.