NTV Telugu Site icon

Ganja Seized: పుష్ప సినిమాకు మించి స్మగ్లింగ్ కు ప్లాన్.. ఏపీకి చెందిన వ్యక్తి అరెస్ట్..

Dangareddy Ganjha

Dangareddy Ganjha

Ganja Seized: అడ్డదారులు తొక్కడానికి అరవై మార్గాలు. పోలీసులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ వర్గాల నిఘాకు చిక్కకుండా గంజాయి స్మగ్లర్లు పుష్ప సినిమాను బాగానే ఫాలో అవుతున్నారు కొందరు కేటుగాళ్లు. అంతేకాదు అందులో స్మగ్లింగ్‌ ఎలా చేస్తారో సేమ్‌ టు సేమ్‌ అలానే చేసేందుకు ఐడియాలు మామూలుగా వేయడం లేదు. అయితే సినిమాలో చూపించే విధంగా రకరకాల ఐడియాలతో స్మగ్లింగ్‌ చేస్తూ చివరకు పోలీసులకు దొరికిపోతుంటారు. ఇలాంటి ఘటనే సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

Read also: Gold Rate Today: స్వల్పంగా తగ్గిన గోల్డ్ రేట్.. నేడు తులం ఎంతుందంటే?

తాజాగా, సంగారెడ్డి కంకోల్ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అక్కడి నుంచి వెళుతున్న ఓ కారును ఆపిన పోలీసులు తనిఖీ చేసిన అందులో ఏమీ దొరకలేదు. ఇంతలోనే పోలీసులకు ఎక్కడో చిన్న అనుమానం కలిగింది. కారు నడుపుతున్న అతన్ని ప్రశ్నించగా పొంతలేని సమాధానం చెప్పడంతో అనుమానం బలపడింది. కారులో ఏదో వుందని అనుమానం వచ్చింది. వెంటనే కారులో కూర్చొన్న సీట్లను తీసి చూడగా అవాక్కయ్యారు. అక్కడ ప్రతి సీటు కింద ఓ బాక్స్‌ ఉంది. అదితీసి చూడగా లోపల రహస్య బాక్స్‌ ఏర్పాటు చేసుకుని అందులో నిండుగా 83.4 కిలోల గంజాయిని బయటకు తీశారు.

Read also: Official : ఇది కదా న్యూస్ అంటే.. రజనీకాంత్ సినిమాలో అమీర్ ఖాన్.. రోలెక్స్ 2.O

ఏఓబి నుంచి మహారాష్ట్రకు తరలిస్తుండగా క్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు పట్టుకున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తితో పాటు వాహనాన్ని సీజ్ చేశారు. పట్టుబడ్డ గంజాయి విలువ 33. 50 లక్షల రూపాయలు ఉంటుందని పోలీసుల అంచనావేశారు. గంజాయి స్మగ్లింగ్ కోసం కారునే తమకు అనుకూలంగా సెట్ చేయించుకున్నట్లు తెలిపారు. సినిమా స్టైల్లో కారు సీటు కింద గంజాయి కోసం ఓ బాక్స్ తయారు చేయించి స్మగ్లింగ్ కు పాల్పడతున్నట్లు గుర్తించారు. ఎవరికి అనుమానం రాకుండా పైన సీట్లు అమర్చి గంజాయిని తరలిస్తున్నట్లు వెల్లడించారు. పక్కా సమాచారంతో ఎక్సైజ్ ఎన్ఫోర్స్ మెంట్ పోలీసులు గంజాయిని కంకోల్ టోల్ ప్లాజా వద్ద పట్టుకున్నట్లు తెలిపారు. గంజాయిని ఏఓబి నుంచి మహారాష్ట్రకు తరలిస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Khammam Thieves: ఖమ్మంలో దొంగలు హల్‌చల్‌.. గ్రామస్తులు వెంటబడటంతో బట్టలు విప్పి పరార్‌

Show comments