Site icon NTV Telugu

Gudem Mahipal Reddy: పటాన్ చెరువు డీఎస్పీ పై డీజీపీకి ఫిర్యాదు చేస్తా.. గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం..

Gudem Mahipal Reddy

Gudem Mahipal Reddy

Gudem Mahipal Reddy: పటాన్ చెరువు డీఎస్పీ పై డీజీపీకి ఫిర్యాదు చేస్తా అని పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ కి భద్రత కల్పించకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. దీనిపై పటాన్ చెరువు డీఎస్పీ పై డీజీపీకి ఫిర్యాదు చేస్తా అన్నారు. వెయ్యి మంది విద్యార్థులకు పైగా పాల్గొన్న ఈ పోటీల్లో భద్రత కోసం ఒక్క కానిస్టేబుల్ లేడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలకి ఏదైనా జరిగితే పోలీసులే బాధ్యత వహించాలి అని అన్నారు. వారం ముందు నుంచి చెప్పిన ఎటువంటి జాగ్రత్తలు తీసుకోలేదన్నారు. ఏమైనా జరిగితే డీఎస్‌పి, సీఐ బాధ్యత వహించాలని తెలిపారు. పోలీస్టేషన్‌ ముందట జిల్లా స్థాయి టోర్నమెంట్‌ నడుస్తున్నా ఒక్క పోలీసు అధికారి కూడా కనిపించక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డీజీపీకి, సీఎం రేవంత్‌ రెడ్డికి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. పిల్లలు జాగ్రత్తా ఉండాలని కోరారు. హెల్త్‌ డిపార్ట్మెంట్‌ ఆంబులెన్స్‌ తో సహా వచ్చారని తెలిపారు. జీహెచ్‌ఎంసీ సిబ్బంది వారం రోజుల నుంచి పనిచేస్తున్నారని తెలిపారు. పిల్లలకు ఏదైనా ఇబ్బంది తెలత్తితే.. పీఈటీ వాళ్లకు, అధికారులకు చెప్పాలన్నారు. నీటి సౌకర్యం లేకున్నా అధికారులకు తెలపాలన్నారు. రోజూ పొద్దున్నే నేనే వచ్చి మీ అందరికి టాస్క్‌ ఇచ్చి సాయంత్రం గెలిచిన వారికి బహుమతులు ఇస్తా అని తెలిపారు.
Sunitha Laxma Reddy: మాపై హత్యాయత్నం చేశారు.. సునీతా లక్ష్మారెడ్డి కీలక వ్యాఖ్యలు

Exit mobile version