Sangareddy: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామికవాడలోని వివిన్ పరిశ్రమలో 300 మంది కార్మికుల ఆందోళన చేపట్టారు. గత కొన్ని నెలలుగా యాజమాన్యం జీతాలు ఇవ్వడం లేదని నిరసన వ్యక్తం చేశారు. బిల్డింగ్ పైకి ఎక్కి దూకేస్తామంటూ కార్మికులు ఆందోళన చేస్తు్న్నారు. ఎనిమిది నెలలుగా జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నామంటున్న కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమలో పని చేస్తున్న 300 మంది కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీతాలు వెంటనే ఇవ్వకపోతే పై నుంచి ఆత్మహత్య చేసుకుంటామని కార్మికుల బెదిరిస్తున్నారు. ఎనిమిది నెలల నుంచి అప్పుడు ఇప్పుడు అంటూ నెలలు గడుస్తున్నా పట్టించుకోవాడం లేదంటూ మండిపడుతున్నారు. తినే తిండిలేక కుటుంబాలు రోడ్డున పడ్డాయని వాపోతున్నారు.
Read also: Leopard in Srisailam: శ్రీశైలంలో చిరుత కలకలం.. భక్తులకు అధికారుల హెచ్చరిక
ఎనిమిది నెలలుగా అప్పులు కుప్పలుగా మారాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భార్య పుస్తలను అమ్మి కుటుంబాన్ని పోషిస్తున్నామని కార్మికులు తెలిపారు. ఎనిమిది నెలలుగా జీతం ఇస్తామంటూ కాలం వృధా చేశారని మండిపడ్డారు. యాజమాన్యం కార్మికుల బాధలు అర్థం చేసుకుంటుందనే ఇంత కాలం ఎదురు చూశామని .. కానీ ఇప్పుడు 300 కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని వాపోతున్నారు. వివిన్ పరిశ్రమక యాజమన్యం ఇప్పికి జీతాలు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చిరిస్తున్నారు. దీనిపై అధికారులు పట్టించుకోవాలని వాపోతున్నారు. పోలీసులు దీనిపై ఆరా తీసి తమకు న్యాయం చేయవాలని కోరుతన్నారు. మరి దీనిపై అధికారులు, పోలీసులు కార్మికులకు అండగా నిలిచి జీతాలు ఇప్పిస్తారా ? అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే మరోవైపు కార్మికుల నిరసనపై వివిన్ పరిశ్రయ యాజమాన్యం మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేకపోవడం గమనార్హం..
AP-Telangana: రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్.. నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు..