Betting Apps : సంగారెడ్డి జిల్లాలో బెట్టింగ్‌ల కారణంగా యువకుల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ఈ నెల 3న సంగారెడ్డిలో ఒక కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న విషాదం మరువక ముందే, బెట్టింగ్‌లలో నష్టపోయిన కారణంగా మరో యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆర్సీపురం పరిధిలోని సాయినగర్ ప్రాంతంలో నివాసముంటున్న అఖిల్ (30) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అఖిల్ అప్పులు చేసి బెట్టింగ్‌లలో పెట్టుబడి పెట్టి, ఆ మొత్తాన్ని నష్టపోయాడు. ఈ నష్టం తట్టుకోలేక అతను ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
Nellore : నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం, కంటైనర్ లారీ ఢీకొని ముగ్గురి మృ*తి !
వివరాల్లోకి వెళితే, అఖిల్ నిన్న ఒక ఓయో హోటల్‌లో రూమ్ బుక్ చేసుకున్నాడు. ఈ రోజు ఉదయం, బెట్టింగ్‌లలో నష్టపోయి ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా తన తండ్రి సంగీత్ రావుకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు. తండ్రి సంఘటన స్థలానికి చేరుకునేలోపే అఖిల్ రూమ్‌లో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పటాన్ చెరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Lionel Messi: 14 ఏళ్ల తర్వాత భారత్‌కు రానున్న ఫుట్‌బాల్ రారాజు..
