NTV Telugu Site icon

Sandra Venkata Veeraiah: కీర్తి వస్తే వాళ్ళది.. అపకీర్తి వస్తే మాదా? సండ్ర సీరియస్‌

Sandra Venkata Veeraiah

Sandra Venkata Veeraiah

Sandra Venkata Veeraiah: కీర్తి వస్తే వాళ్ళది.. అపకీర్తి వస్తే మాదని అన్నటు చేస్తున్నారు ఈ మంత్రులు అని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి అంబేద్కర్ సెంటర్ వద్ద సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో రైతు ధర్నా చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రుణమాఫీ అందరికి అమలు చేయ్యాలని డిమాండ్ చేస్తూ రైతులు బీఆర్ఎస్ నాయకులతో కలిసి ధర్నాలో పాల్లొన్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రుణామాఫీ చిత్తశుద్ది లేని రుణా మాఫీ అని తెలిపారు. ఎంత మందికి రుణామాఫీ ఇవ్వలో శాస్త్రీయంగా లేక్కలు లేకుండా చేశారన్నారు. రైతు లు రుణాలు తీసుకుంటే పై ఉన్న వడ్డి చేల్లిస్తేనే రుణా మాఫీ అవుతుందని ఇప్పుడు అంటున్నారని మండిపడ్డారు. అనేక సంకేతిక కారణాలు చెబుకుంటూ కాలం వెల్లబుచ్చుతున్నారన్నారు. గత పది సంవత్సరాలు అదే రైతులు అదే ఎకౌంట్స్ ఉన్నాయి అప్పుడు లేని సంకేతిక కారణాలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి.

Read also: MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు మరోసారి అస్వస్థత..

ఎన్నికల్లో ప్రతి రైతుకు రుణామాఫీ అన్నారు..ఇప్పుడు అంక్షలు పెడుతున్నారు. 4000 కోట్లు వృద్దుల పెంక్షన్ అపారన్నారు. విధి విధానాలు లేకుండా స్వష్టమైన రుణామాఫీ ఇవ్వడం లేదని మండిపడ్డారు. రాజకీయంగా రుణామాఫీ చేశాం అని అనిపించుకోవాటానికే రుణా మాఫీ చేశారా….? రుణామాఫీ ని నుండి రైతులకు విముక్తి కల్పించటానికి చేశారా…? అని ప్రశ్నించారు. జిల్లాలో రుణామాఫీపై వివక్ష నెలకొందన్నారు. ఎన్నికల్లో రెండు నెలలు ముందు పార్టీ లోకి పోయ్యారన్నారు. ఇప్పుడు ఉన్న జిల్లాలో ఇద్దరు మంత్రులు గత బిఆరెస్ ప్రభుత్వంలో పని చేసిన వాళ్ళే ప్రభుత్వ పధకాలు అమలు చేసిన వాళ్ళే అన్నారు. ఇప్పుడు రెండు నెలలు ముందు పార్టీ మారీ పదువులు అనుభవిస్తున్నారన్నారు. అప్పుడు బీఆర్ఎస్ ను పొగిడిన వాళ్ళే ఇప్పుడు తిడుతున్నారు..ఈ జిల్లాలో ఉన్న మంత్రులన్నారు. కీర్తి వస్తే వాళ్ళది అపకీర్తి వస్తే మానది అన్నటు చేస్తున్నారు ఈ మంత్రులని మండి పడ్డారు. వృద్దులకు ఇవ్వాల్సిన పెంక్షన్ డబ్బులు ఆపి వేరే విధంగా ఉపయోగిస్తున్నారు.ఇలా చెయ్యటం మంచి పద్దతి కాదన్నారు. చివరకు రైతు వరకు న్యాయం జరిగే వరకు ఆందోళ ఆగాదు. ఇది అంతం కాదు ఆరంభమే అన్నారు.

Read also: T. Harish Rao: రైతు రుణ మాఫీపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి..

సీతారామ ప్రాజెక్టు హడావుడి గా చేశారు ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయా? అని ప్రశ్నించారు. కేసిఆర్ చేసిన సీతారామ ప్రాజెక్టు ను వాళ్ళ గొప్పగా చెప్పుకుంటున్నారు.. సీతారామ ప్రాజెక్టు పై అప్పట్లో కేసిఆర్ ను పొగిడిన నోళ్ళే ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు… రైతులకు న్యాయం జరిగేలా పోరాటం చేద్దామన్నారు. శాంతియుతంగా న్యాయం కోసం పొరడదామన్నారు. వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం అని అన్నారు. నెలలు గడుస్తున్న ఎలాంటి ఉసు లేదని మండిపడ్డారు. కౌలు రైతులకు రైతు బందు అన్నారు అసలు రైతులకే దిక్కు లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తెలంగాణలో పెళ్ళిళ్ళు కాలేదా….తులం బంగారం ఎమైంది..? అని ప్రశ్నించారు. ఆకాశమే హద్దుగా హమీలు ఇచ్చి విస్మరించారు. ప్రభుత్వ అధికారులను భాగస్వామ్యం చేసి రుణామాఫీ కానీ రైతులను గుర్తించి కారణాలు తెలిసుకొని చివర రైతు వరకు రుణామాఫీ వర్తించేలా చేయ్యాలన్నారు. ప్రశ్నిస్తే రైతులు మూర్ఖులని అంటున్నారు..కేంద్రాని రాహుల్ గాంధీ ప్రశ్నించటం లేదా అన్నారు. కేంద్రంలో మీకు ప్రశ్నించే హక్కు ఉందో రాష్ట్రం లో మాకు ఉందన్నారు. ప్రశ్నిస్తే ఆవహేళన చేస్తారా? అర్హత కలిగిన రైతంగాన్ని రుణామాఫీ వెంటనే చెయ్యాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
Radha Family: రాధను చంపింది పోలీసులా? మావోయిస్టులా?.. మాకు తెలియాలి..