NTV Telugu Site icon

కీలక విషయం వెల్లడించిన సజ్జనార్‌

ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టినాటి నుంచి టీఎస్‌ ఆర్టీసీని అభివృద్ధి చేసేందుకు తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు సజ్జనార్‌. ఆయన బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కొత్త ఆలోచనలతో ప్రయాణికులు ఎక్కువగా ఆర్టీసీ పై దృష్టి పెట్టే విధంగా చేస్తున్నారు. నూతన సంస్కరణలతో ఆర్టీసీ లాభాలు పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు.

తాజాగా మరో కీలక విషయాన్ని సజ్జనార్‌ వెల్లడించారు. ఆర్టీసీలో ఉన్న ఉద్యోగులకు వంద శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. 48,214 మంది ఉద్యోగులతో పాటు 5,034 మంది మహిళా ఉద్యోగులకు రెండు డోసుల కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ వంద శాతం పూర్తైందని, ఆర్టీసీలో ప్రయాణం మరింత సురక్షితమంటూ ఆయన పేర్కొన్నారు.