VC Sajjanar: తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడాన్ని ఆటో డ్రైవర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ మహాలక్ష్మి పథకం వల్ల తమ జీవితాలు దుర్భరంగా మారుతున్నాయని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ సిబ్బందిపై ఆటో డ్రైవర్లు శత్రువులుగా చూస్తే వారిపై దాడి చేస్తున్నారు. అయితే కొత్తగూడెంలో బస్సు డ్రైవర్పై ఆటో డ్రైవర్లు దాడి చేయడం, భద్రాచలంలో మహిళా కండక్టర్ను ప్రయాణికులు దూషించడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనిపై TSRTC ఎండీ సజ్జనార్ సీరియస్ అయ్యారు. ఆర్టీసీకి బ్రాండ్ అంబాసిడర్లైన సిబ్బందిని దూషించడం, దాడులు చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలను ఆర్టీసీ ఏమాత్రం సహించదని వార్నింగ్ ఇచ్చారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటుందని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే కొందరు అధికారులు స్థానిక పోలీస్టేషన్లలో ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. డ్రైవర్లపై, కండెక్టర్లపై దాడి చేస్తే ఏ మాత్రం సహించేది లేదని అన్నారు. ఇప్పటికైనా ఆటో డ్రైవర్లు సహనం పాటించాలని కోరారు. మాటి మాటికి ఇదే రిపీట్ అయితే.. వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Read also: Pawan Kalyan: అసలు ఎందుకు ట్రెండ్ చేస్తున్నారు మావా… మీ దెబ్బకి సోషల్ మీడియా షేక్ అవుతోంది
జరిగింది ఇదీ..
కొత్తగూడెం పట్టణంలోని పోస్టాఫీసు వద్ద కొందరు ప్రయాణికులు ఆటోలో వెళ్లేందుకు కూర్చున్నారు. అప్పుడే ఖమ్మం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు అటువైపు వచ్చింది. ఆటోలో నుంచి దిగిన ప్రయాణికులు బస్సును నిలిపివేశారు. అసలే కస్టమర్లు లేక ఇబ్బందులు పడుతున్న ఆటోడ్రైవర్లు ఆటో దిగడంతో ప్రయాణికులు ఆగ్రహం చెందారు… ఈ ఆగ్రహంతో బస్సు డ్రైవర్ నాగరాజుపై దాడికి పాల్పడ్డారు. ఆటోవాలాలు బస్సు డ్రైవర్‌ను బయటకు లాగి దాడి చేశారు. అతడిపై నీళ్లు చల్లుతూ దుర్భాషలాడుతూ దారుణంగా ప్రవర్తించారు. బస్సు కండక్టర్‌తో పాటు ప్రయాణికులు, ఇతర వాహనదారులు దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఆటోడ్రైవర్లు ఎవరి మాట వినకుండా దారుణంగా ప్రవర్తించారు. దీంతో ఆగ్రహించిన డ్రైవర్ కె.నాగరాజు తనపై జరిగిన దాడిని ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. వారి సూచన మేరకు కొత్తగూడెం ఆర్టీసీ డిపో మేనేజర్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధిత ఆర్టీసీ డ్రైవర్ నుంచి దాడికి సంబంధించిన వివరాలు సేకరించారు. దాడికి పాల్పడిన ఆటో డ్రైవర్లను గుర్తించి అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.
AP High Court: ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులపై విచారణ.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు