NTV Telugu Site icon

Online Betting: ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు యువకుడు బలి.. రూ.2కోట్ల అప్పులు చేసిన వైనం

Online Betting

Online Betting

Online Betting: ఆన్‌లైన్ బెట్టింగ్‌ల కోసం అప్పుల బాధ తాళలేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నల్గొండ పట్టణానికి చెందిన తడకమల్ల సోమయ్య కిరాణా దుకాణం నిర్వహిస్తుండగా.. అతని కుమారులు సాయికుమార్ (28), సంతోష్ వ్యాపారంలో సహాయం చేస్తున్నాడు. అయితే ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌లు నిర్వహిస్తుండగా సాయికుమార్ దాదాపు రూ.2 కోట్ల వరకు అప్పులు చేశాడు. అప్పు ఇచ్చినవారు ఇంటికి వచ్చి కొద్దిరోజులుగా ఒత్తిడి చేశారు. దీంతో సాయికుమార్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో ఈ నెల 14న బయటకు వెళ్లిన సాయికుమార్ ఇంటికి తిరిగి రాకపోవడంతో సోదరుడు సంతోష్ 17న నల్గొండలోని వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Read also: Water Supply: ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయండి.. జలమండలి ఆదేశం..

పోలీసులు విచారణ ప్రారంభించగా హాలియా చెక్‌పోస్టు వద్ద 14వ మైలురాయి సమీపంలో సాయికుమార్ సెల్‌ఫోన్ సిగ్నల్స్ కనిపించాయి. అయితే సాగర్ కాల్వ వద్ద ద్విచక్ర వాహనం, సెల్ ఫోన్ వదిలేసి కాల్వలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. అప్పటి నుంచి సాయికుమార్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. సోమవారం సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌ మండలం దోసపహాడ్‌ గ్రామ సమీపంలోని సాగర్‌ ఎడమ కాలువలో మృతదేహం తేలడంతో పెన్‌పహాడ్‌ పోలీసులు మృతుడి కుటుంబీకులకు సమాచారం అందించారు. సాయికుమార్ ను విగతజీవిగా చూసిన కుటుంబ సభ్యులు బోరున ఏడ్చారు.
MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా..