Site icon NTV Telugu

Sabitha Indra Reddy : కేసీఆర్‌ హయాంలోనే మహిళలకు భద్రత పెరిగింది

కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక సమాజంలో మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గతంలో సమ్మర్ వస్తే నీళ్ల కోసం మహిళలు ఎదురుకున్న ఇబ్బందులు ఎన్నో ఉన్నాయని, కానీ కేసీఆర్ సీఎం అయ్యాక మహిళలకు నీళ్ల కష్టం లేకుండా చేశారని ఆమె అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో షీ టీమ్స్ ఏర్పాటు చేశారని, పోలీస్ శాఖలో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కేసీఆర్ తెచ్చారని ఆయన వెల్లడించారు. ఎన్‌ఆర్‌ఐ వేధింపులను అరికట్టేందుకు ప్రత్యేక ఎన్‌ఆర్ఐ సెల్ ఏర్పాటు చేశారని, మహిళలకు ఆర్థిక భద్రత కోసం, వడ్డీ లేకుండా రుణాలు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇస్తోందని ఆమె అన్నారు.

మహిళలు రాజకీయంగా ఎదగాలని సీఎం కేసీఆర్ ఎప్పుడూ కోరుకుంటారని, నామినేటెడ్ పోస్టులు మహిళలకు కేటాయించి ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించారన్నారు. మూడు రోజుల పాటు జరిగే మహిళా దినోత్సవ వేడుకల్లో మహిళలందరూ పాల్గొనాలన్నారు. అనంతరం ఇటీవల మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ హత్య కుట్రపై ఆమె స్పందించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై జరిగిన హత్య యత్నం కుట్ర మంచి పద్ధతి కాదని, విపక్షాలు ఆరోపణలు అంటున్నాని, పోలీసుల విచారణలో నిజాలు బయటపడుతాయని ఆమె అన్నారు. ఇలాంటి పనులు ఎవరు చేసిన ఉపేక్షించేది లేదని ఆమె మండిపడ్డారు.

Exit mobile version